ఆ విషయంలో నా పేరెంట్స్ నన్ను సపోర్ట్ చేయలేదు... మృణాల్ కామెంట్స్ వైరల్!

పలు బాలీవుడ్ సీరియల్స్ లో నటిస్తూ సీరియల్ నటిగా కొనసాగుతూ అనంతరం సినిమా అవకాశాలను అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్నటువంటి మరాఠీ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే తెలుగులో ఈమె నటించిన ఏకైక చిత్రం సీతారామం( Sitaraamam ).

 My Parents Did Not Support Me Says Mrunal Thakur, Mrunal Thakur, Sitaramam, Boll-TeluguStop.com

ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయారు.హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ జంటగా నటించారు.

ఈ సినిమా ద్వారా ఈమె ఎంతో మంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వస్తున్నాయి.ఇక ప్రస్తుత ఈమె నాచురల్ స్టార్ నాని( Nani ) తన 30వ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకుంది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వెలువడింది.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మృణాల్ తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.

తనకు నటనపై ఎంతో ఆసక్తి ఉంది అయితే తన తల్లిదండ్రులకు మాత్రం తాను సినిమా ఇండస్ట్రీలోకి రావడం ఏ మాత్రం ఇష్టం లేదని ఈమె తెలియజేశారు.

ఇలా తన తల్లిదండ్రులకు తాను సినిమాలలోకి రావడం ఇష్టం లేకపోవటం వల్లే తననీ సపోర్ట్ చేయలేకపోయారంటూ ఈమె తెలియజేశారు.ఇలా వీరి సపోర్ట్ నాకు లేకపోవడానికి గల కారణం సినిమాల గురించి వారికి పెద్దగా అవగాహన లేకపోవడమేనని మృణాల్ తెలియజేశారు.ఇలా తల్లిదండ్రుల సపోర్ట్( Parents Support ) తనకు లేకపోయినా నటనపై ఆసక్తి ఉండడంతో నటిగా తనని తాను నిరూపించుకోవడం కోసం ఎంతో కృషి చేశానని తెలియజేశారు.

నా నటనని గుర్తించిన చాలామంది తనని ఏకంగా స్మితా పాటిల్( Smitha Patil ) తో పోల్చడం తనకు చాలా గర్వకారణంగా ఉందని ఈమె తెలియజేశారు.ఇలా నటి మృణాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube