Mrunal Thakur : స్టార్ కిడ్స్ ను నిందించడం తప్పు .. నెపోటిజంపై మృణాల్ కామెంట్స్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో టీవీ సీరియల్స్ చేస్తూ అనంతరం హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) ఒకరు.

ఈమె బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ అనంతరం సీతారామం ( Sitaramam ).

సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమెకు తెలుగులో కూడా వరుసగా అవకాశాలు వస్తున్నాయి.ఇక ఈ సినిమా తర్వాత ఇటీవల నాని సరసన నటించిన హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇక త్వరలోనే హీరో విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్నటువంటి ఫ్యామిలీ స్టార్( Family Star ) సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతుంది.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఇండస్ట్రీలో ఉన్నటువంటి నెపోటిజం ( Nepotisam ) గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇటీవల తాను బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక అవార్డు వేడుకలో పాల్గొన్నానని తెలిపారు.

ఈ అవార్డు వేడుక అనంతరం మీడియా వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు.

Advertisement

అదే సమయంలో అక్కడకు ఒక స్టార్ కిడ్ రావడంతో వెంటనే వాళ్ళందరూ నన్ను వదిలేసి వెళ్లిపోయారని ఈమె తెలిపారు.ప్రతి ఒక్కరు నెపోటిజం విషయంలో స్టార్ కిడ్స్ ని నిందిస్తూ ఉంటాము.కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.

నెపోటిజం అనేది స్టార్ కిడ్స్ తప్పు కాదు అన్నారు.నెపో కిడ్స్ గురించి వార్తలు రాయడానికి మీడియా కూడా ఆసక్తి చూపుతూ ఉంటారు అంటూ ఈమె కామెంట్లు చేశారు.

అయితే ఈ వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ మీడియా, ఆడియన్స్ మాత్రమే ఇండస్ట్రీలో నెపోటిజాన్ని హైలైట్ చేస్తున్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు ప్రశాంత్ నీల్ అదిరిపోయే తీపికబురు.. అలా చెప్పి షాకిచ్చారుగా!   
Advertisement

తాజా వార్తలు