ప్రభాస్ ( Prabhas ) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ కల్కి( Kalki ) 2898AD.ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్నప్పటికీ హిందూ మైథలాజి బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
ఈ సినిమా ఈ వేసవి సెలవులను పురస్కరించుకొని మే 9వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులను పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ సినిమాలో ప్రభాస్ మహా విష్ణు దశావతారంలోని కల్కి పాత్రని పోషిస్తున్నారని తెలుస్తోంది.
ఇకపోతే మన ఇతిహాసాలలో ఉన్నటువంటి సప్త చిరంజీవులుగా ఈ సినిమాలో పలువురు స్టార్ సెలబ్రిటీలో నటించబోతున్నారు అంటూ ఇదివరకు సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి.ఇలా ఈ సినిమాకు సంబంధించి రోజుకు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అయితే తాజాగా ఈ సినిమాలో మరొక స్టార్ హీరోయిన్ కూడా నటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాలో దీపికా పదుకొనే( Deepika Padukone )హీరోయిన్ పాత్రలో నటించగా రాధా పాత్రలో మరో స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) నటించబోతున్నారని తెలుస్తుంది.ఈ పాత్ర కృష్ణుడి ప్రేయసి అయిన రాధ అని తెలుస్తుంది.ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.ఇప్పటికే దీపికా పదుకొనే , దిశా పటాన్ని వంటి స్టార్స్ నటించబోతున్న విషయం తెలిసిందే.ఇప్పుడు మృణాల్ కూడా బాగం కాబోతున్నారని తెలిసి సినిమాపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి.మృణాల్ పాత్ర గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.