హీరో నాని కి కూతురుగా నటించబోతున్న మృణాల్ ఠాకూర్..? ఇదెక్కడి విచిత్రం అండీ బాబోయ్!

విభిన్నమైన కథలు,విభిన్నమైన పాత్రలు చేస్తూ కెరీర్ లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న హీరో న్యాచురల్ స్టార్ నాని.

( Nani ) ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి,అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించి,ఆ తర్వాత అష్టా చమ్మ సినిమా ద్వారా హీరో గా మారి, ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు వంద కోట్ల రూపాయిలు కొల్లగొట్టిన హీరోల జాబితాలో ఒకడిగా నిలిచాడు.

నాని కి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ వేరు,తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజి ని ఏర్పాటు చేసుకున్నాడు.ఇక రీసెంట్ గా ఆయన దసరా చిత్రం తో( Dasara Movie ) భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి,వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన హీరోల జాబితా లిస్ట్ లోకి చేరిపోయాడు.

అయితే ఈ సినిమా తర్వాత ఆయన ఎలాంటి చిత్రం చెయ్యబోతున్నాడు అనే దానిపై ఉన్న సస్పెన్స్ ని దసరా విడుదలకు ముందే బయటపెట్టాడు.

సీత రామం చిత్ర హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో( Mrunal Thakur ) కలిసి శౌరవ్ అనే కొత్త దర్శకుడితో సినిమాని ప్రారంభించాడు.ఈ చిత్రం ప్రారంభోత్సవానికి మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా కూడా పాల్గొన్నాడు.అలా గ్రాండ్ గా ప్రారంభమైన ఈ సినిమా కొంత భాగం షూటింగ్ ని పూర్తి చేసుకుంది.

Advertisement

ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసారు.ఈ చిత్రానికి హాయ్ నాన్న( Hi Nanna ) అనే టైటిల్ ని ఖరారు చేసారు.

ఈ టైటిల్ టీజర్ చూసినా తర్వాత చాలా కొత్త రకం కాన్సెప్ట్ తో డైరెక్టర్ ఈ సినిమాని తీసినట్టుగా అర్థం అవుతుంది.అదేమిటంటే ఈ చిత్రం లో మృణాల్ ఠాకూర్ నాని కి కూతురిగా నటిస్తుంది.

భవిష్యత్తు నుండి వర్తమానం లోకి వచ్చిన మృణాల్ ఠాకూర్, నాని ని నాన్న అని పిలుస్తుంది.

వర్తమానం లో చిన్న పాపగా ఉన్న కూతురిని ఎంచుకుంటాడా, లేదా భవిష్యత్తు నుండి వచ్చిన కూతురుని ఎంచుకుంటాడా?, వీళ్లిద్దరి లో నాని ఎవరిని తన కూతురుగా అంగీకరిస్తాడు అనేదే స్టోరీ.ఇలాంటి విభిన్నమైన కథాంశాలు ఉన్న చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదల చెయ్యాలి.అందుకే ఈ సినిమాని అన్నీ ప్రాంతీయ భాషల్లో ఘనంగా విడుదల చెయ్యబోతున్నారు.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

దసరా చిత్రం తెలుగు లో పెద్ద హిట్ అయ్యింది కానీ, ఇతర భాషల్లో అంతగా ఆడలేదు, మరి ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియా లెవెల్ లో హిట్ కొట్టబోతున్నాడో లేదో అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు