టాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్( Mrinal Thakur ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలీవుడ్ బ్యూటీ అయిన మృణాల్ ఠాకూర్ తెలుగులో ఇప్పటివరకు మూడే మూడు సినిమాలలో నటించింది.
ఈ మూడు సినిమాలతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్( Seetharam, Hi Nanna, Family Star ) లాంటి మూడు సినిమా లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కాగా తాజాగా ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ మూవీలో నటించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మంచి సక్సెస్ ని సాధించింది.
అయితే ఈ మూవీతో మృణాల్ ఠాకూర్ హ్యాట్రిక్ హిట్ కొడుతుందని అంతా భావించారు.కానీ బ్యూటీ సక్సెస్ జోష్ కు ఈ సినిమా బ్రేక్ వేసింది.అయితే డైరెక్టర్ రాసిన స్క్రిప్ట్, పాత్రకు తన వంతు న్యాయం మాత్రం చేసింది.ఫస్టాఫ్ లో నవ్వుతూ, సెకండాఫ్ లో భావోద్వేగాలను బాగా పండించింది.కానీ దర్శకుడు పరశురామ్ ( Directed by Parashuram )ఆమె రోల్ ను సినిమాకు తగ్గట్టు డెవలప్ చేయడంలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి.అయితే టాలీవుడ్ లో ఇప్పటి వరకు మృణాల్ ఠాకూర్ చేసిన మూడు సినిమాలు కూడా ఒకే జోనర్ కు చెందినవి కావడం గమనార్హం.
మూడు సినిమాల్లో కూడా ఒక మిడిల్ క్లాస్ కుర్రాడితో ప్రేమలో పడిపోయే ధనిక యువతిగా నటించింది.క్యారెక్టర్ పరంగా మూడు సినిమాల్లోని రోల్స్ సేమ్ కానప్పటికీ బేసిక్ కాన్సెప్ట్ ఒకటే అవ్వడం విశేషం.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.మంచి టాలెంట్ ఉన్న మృణాల్ ఠాకూర్ మూడు చిత్రాలకు గాను సేమ్ జోనర్ కు చెందిన క్యారెక్టర్లను సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ప్రెజంటేషన్ వేర్వేరుగా ఉన్నా మంచి ప్రతిభ గల నటి అలా చేయకూడదని సూచిస్తున్నారు.కొత్త సినిమాలను జాగ్రత్తగా చూసి ఎంపిక చేసుకోవాలని అంటున్నారు.మరి తదుపరి సినిమాల విషయంలో అయినా మృణాల్ ఠాకూర్ జాగ్రత్తగా ఉంటుందో లేదో చూడాలి మరి.అయితే ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయంలో మాత్రం తొందర పడడం లేదు.ఆచితూచి కథలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటోంది.తెలుగు సినిమాలు చేస్తూనే కోలీవుడ్ లో మెల్లగా అవకాశాలు దక్కించుకుంటోంది.తమిళ స్టార్ హీరోలు అజిత్, శివకార్తికేయన్, శింబుతో ఆడిపాడనుంది.