శ్రీమతి వైజాగ్ ఆడిషన్స్

తెలుగు సంప్రదాయం ఉట్టిపడే విధంగా శ్రీమతి వైజాగ్ ఆడిషన్స్ అద్భుతంగా జరిగాయి.అతివలు అచ్చమైన తెలుగుదనం ఉట్టి పడేలా చీరకట్టులో ఆడిషన్స్ కు హాజరయ్యారు.

 Mrs. Vizag Auditions-TeluguStop.com

మన సంస్కృతి, సంప్రదాయం ఉట్టి పడేలా ఈ ఎంపికలు జరిగాయి.ఆదివారం ఉదయం నగరంలోని దొండపర్తి దగ్గర గల బెస్ట్ వెస్ట్రన్ హోటల్ లో జరిగిన ఈ ఆడిషన్స్ కు 150 మందికి పైనే అతివలు హాజరయ్యారు .ఇందులో కొందరు ఆన్ లైన్ లో తమ ఎంట్రీలను నమోదు చేసుకోగా మరికొందరు నేరుగా హాజరయ్యారు.వీరిలో అన్ని విభాగాల్లో ప్రతిభ కనబరిచిన టాప్ 20 ఫైనల్ పోటీదారులను ఎంపిక చేయడం జరిగింది.

వీరికి అన్ని అంశాలలో పూర్తిస్థాయి శిక్షణనిచ్చి జూన్ 4న గ్రీన్ పార్క్ హోటల్ లో జరిగే ఫైనల్ ఈవెంట్లో తలపడేందుకు సిద్ధం చేస్తున్నట్లు రేస్ ఈవెంట్ మేనేజర్ దాడి రవి కుమార్, డ్రీమ్స్ ఈవెంట్ మేనేజర్ అష్రఫ్ ఖాన్ లు తెలిపారు .ఈ ఆడిషన్స్ కార్యక్రమంలో శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ అధినేత ఫణి కుమార్, ఢిజీపే గ్రూపు ప్రతినిధి సునీల్, జేడీ ఫ్యాషన్ టెక్నాలజీస్ ఎండి కట్టమూరి ప్రదీప్, సురక్ష హాస్పిటల్స్ అధినేత బొడ్డేపల్లి రఘు, ఐరిస్ డెంటల్ కేర్ యం డి వింజమూరి అనిల్, వరుణ్ బజాజ్ సీఈవో ఆడారి శ్రీనివాస్ , హాలిడే వరల్డ్ ఎండి కె విజయ మోహన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే.లక్ష్మి ప్రియ, బెస్ట్ వెస్టెన్ హోటల్ ఎండి శ్రీకాంత్,ఫ్యాషన్ డిజైనర్ సంధ్యారాణి నాయక్,కొరియోగ్రాఫర్ శిల్పా నాయక్ , ప్రిన్సెస్ ఏపీ టైటిల్ విజేత సంధ్యారాణి, హలో వైజాగ్ ప్రతినిధి ఉదయ్, ప్రముఖ బ్యూటీషియన్ సునీత,తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube