అసెంబ్లీ బరిలో ఎంపీలు : బిజెపి లక్ష్యం ఏమిటంటే?

వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికలు రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ లాంటివని ఇప్పటికే అంచనాలు ఏర్పడిన దరిమిలా రెండు పెద్ద పార్టీలైన కాంగ్రెస్ బిజెపిలు సర్వశక్తులూ ఒడ్డడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నాయి.

ముఖ్యంగా అధికార బాజాపాకు దేశవ్యాప్తం గా వ్యతిరేకత పెరిగిందని, మోడీ గ్రాఫ్ తగ్గుతుందని ప్రచారం జరుగుతున్న వేళ ఈసారి ఎలాగైనా హ్యాట్రిక్ రిపీట్ చేయాలని భావిస్తున్న భాజపా తన శక్తి యుక్తులన్నీ ప్రయోగిస్తున్నట్లుగా తెలుస్తుంది.

ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలలో సరైన ఫలితాలు రాకపోతే ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికల పై పడే అవకాశం ఉందని భావిస్తున్న భాజపా తమ గెలుపు గుర్రాలను అసెంబ్లీ పరిధిలో నిలపడానికి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది.

దానికి తగ్గట్టుగానే మధ్యప్రదేశ్ రాజస్థాన్లలో ఏడుగురు ఎంపీలు చొప్పున అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుపుతుంది.తెలంగాణలో కూడా బండి సంజయ్,( Bandi Sanjay ) లక్ష్మణ్, కిషన్ రెడ్డి( kishan Reddy ) లాంటి వారిని మరోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపుతున్నట్లుగా తెలుస్తుంది.దీని ద్వారా భాజపా బహుళ ప్రయోజనాలు ఆశిస్తున్నట్లుగా కనిపిస్తుంది .ఒకటి ఈ కీలక నేతల అసెంబ్లీ బరిలో ఉండటం ద్వారా ఆ ప్రభావం ఆ నియోజకవర్గంలో పడి సరైన ఫలితాలు సాధించడం అన్నది ఒకటి .ఇంకోటి పార్లమెంట్ స్థాయి పరిధిలో కొత్త రక్తాన్ని తీసుకురావాలంటే కొంతమంది నేతలను రాష్ట్ర పరిధిలో అకామిడేట్ చేయాల్సిన పరిస్థితుల్లో కొంతమంది నేతల పరిధిని తగ్గించడానికి కూడా ఈ విధమైన నిర్ణయం తీసుకుంటుందని ప్రచారం జరుగుతుంది.మరోవైపు మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన నేతలను కూడా ఈసారి అసెంబ్లీకి పంపించాలని భాజపా ప్రయత్నిస్తుంది కేంద్ర స్థాయిలో మోడీకి( Narendra Modi ) పోటీకి రాకుండా చేయడం కోసమే భాజపాలాంటి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని కూడా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి.

ఏది ఏమైనప్పటికీ తమ పార్లమెంట్ సభ్యులను అసెంబ్లీకి పోటీ చేయించడం ద్వారా తాము ఈ ఎన్నికల విషయంలో ఎంత సీరియస్ గా ఉన్నామన్న సంకేతాలను ఇవ్వడానికే భాజపా ( BJP )ప్రయత్నిస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు .

Advertisement
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

తాజా వార్తలు