బాబాయి కేసును పార్లమెంట్‌ వరకు తీసుకు వెళ్తాడట

ఏపీ ప్రతిపక్ష పార్టీ వైకాపాకు చెందిన ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం రోజు రోజుకు సొంతం పార్టీకి ఇబ్బంది మారుతుంది.వైకాపా నాయకులను పదే పదే విమర్శించడంతో పాటు పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న ఈ ఎంపీ తాజాగా పార్టీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డిపైనే ఆరోపణలు చేస్తూ ఆయన్ను ఇబ్బంది పెడుతున్నాడు.

 Mp Raghurama Krishnam Raju Want To Tack Viveka Case To Parliament-TeluguStop.com

సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం అక్రమాస్తుల కేసులో బెయిల్‌ పై ఉన్న విషయం తెల్సిందే.జగన్ బెయిల్‌ ను రద్దు చేయాలంటూ కోర్టుకు వెళ్లిన ఈ ఎంపీ మరో ఆసక్తికర ప్రకటన చేశాడు.

స్వయానా సీఎం జగన్ మోహన్‌ రెడ్డికి బాబాయి అయిన వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ప్రభుత్వం సీరియస్ గా లేకపోవడం ఆశ్చర్యంగా ఉందంటూ ఆయన వ్యాఖ్యలు చేశాడు.వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన ఎంక్వౌరీ విషయం గురించి తాను పార్లమెంట్‌ లో ప్రస్థావించాలనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

ఈ కేసు విషయం కనుక పార్లమెంట్‌ లో రఘురామ కృష్ణం రాజు ప్రస్థావిస్తే సీఎం వ్యక్తిగతంగా ఇబ్బంది పడటంతో పాటు ప్రభుత్వం పరువు కూడా పార్లమెంట్‌ సాక్షిగా పోయినట్లు అవుతుందని కొందరు వైకాపా వారు గుసగుసలాడుకుంటున్నారు.రఘురామ కృష్ణం రాజును ఆపే అవకాశమే లేదా అంటూ వైకాపా నాయకులు జుట్టు పీక్కుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube