మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగర్ శివ్ విహార్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రియాంక గుప్త కుటుంబానికి ఈనెల వచ్చిన బిల్లు పెద్ద షాక్ ని ఇచ్చింది.తమ ఇంటికి వచ్చిన బిల్లను చూసి యజమాని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
మొత్తం 3 వేల 419 కోట్ల రూపాయల బిల్లు రావడంతో స్థానిక ప్రాంత ప్రజలు కూడా చూసేందుకు తరలి వచ్చారు.ఇదేంటి ఇంత బిల్లు రావడమేంటని విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నించినప్పటికీ.
మీకు బిల్లు అంతే వచ్చింది.అదే కట్టాలని చెప్పారు.
అయితే ఏం చేయాలో పాలుపోని కుటుంబ సభ్యులు విషయాన్ని స్టేట్ పవర్ కంపెనీ దృష్టకి తీసుకెళ్లారు.జరిగిన పొరపాటు గుర్తించి తప్పుని ఒప్పుకున్నారు.
మీకు కేవలం 1300 రూపాయల బిల్లు మాత్రమే వచ్చిందంటూ బిల్లుని సవరించి ఇచ్చారు.అయితే తప్పుకు కారణం బిల్ ఇచ్చిన ఉద్యోగిదే అని వివరించారు.అయితే విద్యుతు బిల్లు పంపిణఈకి వచ్చి ఉద్యోగి సాఫ్ట్ వేర్ లో యూనిట్లు అని ఉన్న చోట పొరపాటున వినియోగదారు సంఖ్యను రాశారు.దీంతో వందల్లో రావాల్సిన బిల్లు వేల కోట్లలోకి చేరింది.
అయితే తప్పు చేసిన విద్యుత్ ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ అధికారులు చెప్పారు.ఈ విషయంపై విద్యుత్ శాఖ మంత్రి ప్రద్యమ్న సింగ్ తోమర్ కూడా స్పందించారు.
తప్పు చేసిన ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.వందల్లో రావాల్సిన బిల్లు వేల కోట్లలో వచ్చేలా చేసి వారిని ఆస్పత్రి పాలయ్యేలా చేశారంటూ మండిపడ్డారు.