హైదరాబాద్ నార్సింగిలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో జరిగిన సాత్విక్ ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఈ మేరకు శ్రీ చైతన్య కాలేజీ వద్ద ఎంపీ కోమటిరెడ్డి నిరాహార దీక్షకు దిగారు.
సాత్విక్ మృతికి కారణమైన దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో నిందితులను కఠినంగా శిక్షించేవరకు పోరాటం చేస్తామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
అదేవిధంగా పార్టీలకు అతీతంగా దోపిడీ విద్యావ్యవస్థకు బుద్ధి చెబుతామని తెలిపారు.