మరో తలనొప్పి తెచ్చిన కేశినేని నాని

గత కొద్దీ రోజులుగా టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహార శైలి ఆ పార్టీ కి తలనొప్పిగా మారింది.ఆ పార్టీ పై అసంతృప్తి చెందిన కేశినేని నాని ఒక్కోసారి విపరీత చర్యలకు పాల్పడి వార్తల్లో నిలుస్తున్నారు.

 Mp Kesineni Nani Controversial Comments-TeluguStop.com

మొన్నటికి మొన్న చీఫ్ విప్ పదవి ని ఆఫర్ చేయగా నేను దానికి అర్హుడను కాను మరెవరినైనా ఆ పదవిలో ఎన్నుకోవాలి అంటూ సున్నితంగా తిరస్కరించిన నాని మనసులో ఎదో విషయం ఉందని టీడీపీ నేతలు భావిస్తున్నారు.ఇప్పటికే మాజీ మంత్రి దేవినేని -తోటి టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్ – రామ్మోహన్ నాయుడులకు బాబు అందలం ఎక్కివ్వడాన్ని జీర్ణించుకోలేని ఆయన గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా సాక్షిగా ఆ పార్టీ పై పరోక్షంగా తన అక్కసును వెళ్లగక్కుతున్నారు.

తరచూ ఎదో ఒక దుందుడుకు చర్యకు పాల్పడి చంద్రబాబును ఇరుకునపెడుతున్నారు.

-Telugu Political News

ఇప్పుడు తాజాగా పార్టీ అధినేత చంద్రబాబును సంప్రదించకుండానే తనంతట తానుగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం మరోసారి ఆ పార్టీలో కాకరేపుతోంది.టీడీపీ అధిష్టానానికి చెప్పకుండానే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమీక్షా సమావేశాన్ని ఎంపీ కేశినేని నాని నిర్వహించడం దానికి నియోజకవర్గ కార్పొరేటర్లు – నాయకులు – మాజీ కార్పొరేటర్లు సహా అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.అంతటితో ఆగకుండా తనకు అత్యంత ఆప్తుడైన మైనార్టీ టీడీపీ నేత ‘నాగుల్ మీరా’ను వచ్చేసారి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీచేస్తారని నాని ప్రకటించడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.

ఇప్పుడిదే ఆ పార్టీలో దుమారం రేపుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube