స్టార్ హీరోయిన్ లలో సమంత రూత్ ప్రభు(Samantha Ruth Prabhu) ఒకరు.ఈమె స్టార్ హీరోల అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
అయితే ఈమె కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నాగ చైతన్య(Naga Chaitanya))ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం అయ్యింది ఆ తర్వాత విడాకులు తీసుకోవడం కూడా అయిపోయింది.ఇక విడాకుల తర్వాత సామ్ మళ్ళీ తన సినీ కెరీర్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

పుష్ప(Pushpa) ఐటెం సాంగ్ తో ఈమె పాన్ ఇండియా వ్యాప్తంగా పాపులర్ అయ్యింది.ఈ పాట తర్వాత ఈమెకు మరిన్ని అవకాశాలు వరించాయి.బాలీవుడ్ లో కూడా బడా ప్రాజెక్ట్స్ పై సైన్ చేసింది.అయితే వరుస అవకాశాలు అందుకుంటూ వాటిని పూర్తి చేస్తున్న సమయంలోనే ఈమె హెల్త్ ప్రాబ్లెమ్ బారిన పడింది.
ఇప్పుడిప్పుడే దీని నుండి కోలుకున్న ఈమె ఈ మధ్యనే షూట్ లో పాల్గొంటుంది.

సిటాడెల్ వెబ్ సిరీస్(Citadel) తో పాటు తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఖుషీ(Khushi) సినిమా కూడా చేస్తుంది.ఈ రెండు ప్రాజెక్టుల షూటింగ్ లో సమంత పాల్గొంటుంది.ఇదిలా ఉండగా ఈమె సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటుంది అనే విషయం అందరికి తెలుసు.
ఎప్పుడు తనదైన శైలిలో పోస్టులు పెడుతూ అందరిని ఇంప్రెస్ చేస్తుంది.

ఇక తాజాగా మరో మోటివేషనల్ పోస్ట్(Motivational Post) పెట్టింది.కొన్నిటిని ఎదుర్కోవడానికి మన బలం సరిపోదు.అప్పుడు మనకున్న నమ్మకం ముందుకు తీసుకు వెళ్తుంది.
ఆ నమ్మకమే గురువుగా, స్నేహితుడిగా మారుతుంది.అని చేసిన పోస్ట్ అందరిని ఆకట్టుకోవడంతో వైరల్ అయ్యింది.అయితే ఈ పోస్ట్ పై బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ(Anushka Sharma) సైతం కామెంట్స్ చేసింది.”నేను దీనిని పూర్తిగా అంగీకరిస్తున్నాను” అంటూ సమంత పోస్ట్ కి హార్ట్ ఎమోజీ(Heart Emoji)ని జోడించి ట్వీట్ చేసింది.దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు మరింత వైరల్ అవుతుంది.







