ఇటీవలే కాలంలో చాలా మంది యువత ప్రేమ వివాహాలు( Love Marriage ) చేసుకుంటున్న సంగతి తెలిసిందే.అయితే కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల ప్రేమను అర్థం చేసుకొని ప్రేమవివాహాలను స్వాగతిస్తారు.
మరి కొంతమంది తల్లిదండ్రులు పిల్లల ప్రేమకు అడ్డు చెప్పడం, వినకపోతే చివరికి ఎలాంటి దారుణాల కైనా పాల్పడతారు.ఈ క్రమంలోనే కుమార్తె ప్రేమ వివాహం చేసుకుంటాను అనడంతో తట్టుకోలేకపోయిన తల్లి గ్రామంలో తమ పరువు అంతా పోతుందని భావించి కొడుకు సహాయంతో కూతురిని హత్య చేసిన ఘటన అనంతపురం జిల్లాలోని( Anantapuram ) గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో చోటు చేసుకుంది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో 17 ఏళ్ల మైనర్ బాలిక కోమల( Komala ) తమ తల్లిదండ్రులు చూసిన సంబంధం కాకుండా తాను ప్రేమించిన వాడిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులతో వాదించింది.కోమల ఒకవేళ ప్రేమ వివాహం చేసుకుంటే కోటంక గ్రామంలో( Kotanka Village ) తమ పరువు పోతుందని ఆమె తల్లి భావించింది.
కుమార్తెను ఎన్నిసార్లు నచ్చజెప్పిన, బెదిరించిన, చివరకు కొట్టిన కూడా కోమల ప్రేమ వివాహమే చేసుకుంటానని తెగేసి చెప్పడంతో ఆమె తల్లి హత్య చేయాలని అనుకుంది.

తల్లి, సోదరుడు కలిసి కోమల గొంతుకు చున్నీ బిగించి ఊపిరి ఆడనీయకుండా చేసి హత మార్చారు.హత్య అనంతరం ఆమె తల్లి సోదరుడు గార్లదిన్నె పోలీస్ స్టేషన్ కు( Garladinne Police Station ) వెళ్లి హత్య గురించి పోలీసులకు చెప్పి లొంగిపోయారు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అంతా పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ విషయం గ్రామంలో తెలియడంతో ఒక్కసారిగా స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.







