ప్రస్తుత కాలంలో అక్రమ సంబంధాల మోజులో పడి ఇతరుల ప్రాణాలు తీయడానికి కూడా ఏమాత్రం వెనకాడటం లేదు.కాగా తల్లీ కూతుళ్లు ఇద్దరూ కలిసి ఒకే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేసాడని మరో యువకుడిని దారుణంగా హతమార్చిన ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే భరత్ అనే యువకుడు తన తల్లి, సోదరితో కలిసి స్థానిక రాష్ట్రంలోని “కోహానా” పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.కాగా భరత్ పెద్దగా చదువుకోకపోవడంతో కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా దొరికేటటువంటి చిన్న చిన్న పనులను చేసేవాడు.
అయితే ఈ మధ్య కాలంలో తన తల్లి మరియు సోదరి అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తున్న రంజిత్ అనే వ్యక్తి తో చనువుగా ప్రవర్తిస్తున్నారు.దీంతో వీరి ప్రవర్తనపై అనుమానం కలిగిన భరత్ అసలు విషయం కనుక్కోమని తన స్నేహితుడైన నవీన్ అనే యువకుడికి చెప్పాడు.
దీంతో తన స్నేహితుడు చెప్పాడని నవీన్ భరత్ తల్లి మరియు సోదరిపై నిఘా ఉంచాడు.ఈ క్రమంలో తల్లీ కూతుళ్ళు కలిసి రంజిత్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు తెలుసుకొని తన స్నేహితుడికి ఈ విషయం గురించి తెలియజేశాడు.
దీంతో భరత్ తన తల్లి మరియు సోదరిలను మందలించాడు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లీకూతుళ్లు తమ ప్రియుడు రంజిత్ తో కలిసి పన్నాగం పన్ని నవీన్ ని దారుణంగా హత మార్చారు.
అనంతరం సైలెంట్ గా మృత దేహాన్ని పూడ్చి పెట్టేశారు.