ఒక మనిషి మానసిక స్దితి సరిగా లేకుంటే రాక్షసుడి కంటే ఘోరంగా ప్రవర్తిస్తాడని నిరూపించాడు ఈ కిల్లర్.అతని పేరే రాములు.
ఇతను ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 18 మంది మహిళలను అతి దారుణంగా హతమార్చి సైకో కిల్లర్ గా పిలవబడుతున్నాడు.ఇక ఇతన్ని హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారట.
నేరం చేసిన వాడు ఏ రోజైనా శిక్ష అనుభవించక తప్పదని ఈ నేరగాడి అరెస్ట్‌తో నిరూపించబడింది.ఇకపోతే సైకో రాములుకు కల్లు కాంపౌండ్లు, మద్యం దుకాణాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ఒంటరి మహిళలనే టార్గెట్ చేస్తాడట.
ఇలా ఇప్పటివరకూ 18 మంది మహిళలను అతను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.కాగా ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్ శివారులోని అంకుషాపూర్ సమీపంలో మొదట ఓ మహిళ మృతదేహం పోలీసులకు లభ్యమైందట.
కానీ ఆమెకు సంబంధించిన వివరాలేమి దొరకలేదట.అయితే సంఘటనా స్థలంలో దొరికిన ఒకే ఒక్క చిన్న క్లూతో పలు సంచలన విషయాలు బయట పడ్డాయంటున్నారు పోలీసులు.
ఆ చీటిలో దొరికిన సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టి ఈ కేసులో చివరికి పురోగతి సాధించారు.గతంలో రాములు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో పోలీసులు ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది.
అక్కడి నుంచి తప్పించుకు పారిపోయిన రాములు ఎట్టకేలకు మళ్లీ పోలీసుల చేతికి చిక్కాడు.మరి ఈ సారైనా ఇతన్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని శిక్షపడేలా చేస్తారా లేదా అని అనుకుంటున్నారట ఈ విషయం తెలిసిన వారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy