టాలీవుడ్ లో ఇలాంటి ఒక అండర్ రేటెడ్ ఆర్టిస్ట్ ని ఇన్నేళ్లకు గుర్తించారా ?

సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది నటులు వస్తుంటారు పోతుంటారు.కానీ కొంతమంది ఇక్కడ నిలదుక్కుకుంటారు.

అయితే సక్సెస్ ఏ వయసులో వస్తుంది అని ఎవరు మాత్రం చెప్పగలరు.ప్రస్తుతం చాలామంది నటీనటులు లేటుగా కూడా తమలోని టాలెంట్ ని బయటపెడుతున్నారు.

ప్రేక్షకులు కూడా ఏ వయసు వారినైనా కూడా బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు.అయితే ఇదంతా చెప్పడానికి గల కారణం ఏంటి అంటే పత్తిపాటి అజయ్ ఘోష్.

దాదాపు 60 ఏళ్ల వయసున్న ఈ నటుడు సోలోగా ఒక సినిమాను నిలబెట్టే రోజు వస్తుందని ఏ రోజు అనుకొని ఉండడు.తాజాగా తను నటించినా మ్యూజిక్ షాప్ మూర్తి( Music Shop Murthy ) అనే సినిమా విడుదల అయింది.

Advertisement

సినిమా అయితే మంచి అప్లాజ్ దక్కించుకుంది.దానిలో ఆయన నటన ఖచ్చితంగా హైలెట్ అని చెప్పుకోవచ్చు.

ఇప్పుడు అజయ్ గోష్( Ajay Ghosh ) గురించి చెప్పాల్సిన అవసరం ఎందుకొచ్చిందంటే ఆయన వయసు 60 ఏళ్లు అని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం.ఈ వయసులో ఒక కమీడియన్ రోల్ లో( Comedian Role ) సినిమాని నిలబెట్టడం అంటే అంత ఈజీ కాదు.ఎందుకంటే ఇప్పుడు వస్తున్న కామెడీని చూడడానికి ప్రేక్షకులు కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

కొత్తదనం ఉంటే తప్ప ఎవరు ఏ సినిమాని ఒప్పుకోని రోజులు ఇవి.ఇలాంటి ఒక టైం లో అజయ్ గోష్ మ్యూజిక్ షాప్ మూర్తి అనే ఒక సినిమా తీసి ప్రేక్షకులను కన్విన్స్ చేయడం అనే విషయం సాధారణమైన విషయం అయితే కాదు.ఆయన తన నటనతో ఈ సినిమాని నిలబెట్టాడు.

మూర్తి పాత్రలో చక్కగా ఒదిగిపోయి నటించాడు.అయితే ఈ వయసులో అతడు ఒక హీరో కి సరి సమానమైన పాత్ర పోషించి అందరి చేత శభాష్ అనిపించుకోవడమే కోసమేరుపు.

ఈరోజు పొగిడిన నోళ్లే రేపు తిడతాయి.. జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
రాజమౌళి ఓ పిచ్చోడు.. ప్రేమతో తారక్ చేసిన ఈ కామెంట్స్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే!

ఇకపై అజయ్ ని అందరు మూర్తి గారు అని పిలిచినా ఆశ్చర్య పోనవసరం లేదు.

Advertisement

ఎన్నో సినిమాల్లో నటించిన ఆయనకు రావాల్సిన గుర్తింపు రాలేదు.2010లో ప్రస్థానం సినిమా తో( Prasthanam Movie ) ఆయన నటుడు అయ్యాడు.ఈ 15 ఏళ్లలో ఎన్నో సినిమాల్లో నటించాడు.తమిళ్, కన్నడ భాషల్లో కూడా కొన్ని సినిమాల్లో నటించాడు.2021 సైమ అవార్డ్స్ లో బెస్ట్ కమెడియన్ గా రాజు గారి గది 3 సినిమాకి అవార్డు కూడా అందుకున్నాడు.అయితే టాలీవుడ్ లో అజయ్ ఘోష్ మాత్రమే కాదు.

చాలామంది అండర్ రేటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు.తమకంటూ ఒకరోజు అవకాశం ఇస్తే ఖచ్చితంగా తమను తాము నిరూపించుకోగలరు.

ఈ అవకాశం అజయ్ ఘోష్ కి మ్యూజిక్ షాప్ మూర్తి ద్వారా ఖచ్చితంగా వచ్చింది అని చెప్పుకోవచ్చు.

తాజా వార్తలు