మోస్ట్ పాపులర్ హీరోల జాబితాలో టాప్ లో ప్రభాస్.. ఎన్టీఆర్, బన్నీ, మహేష్ స్థానాలివే!

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ( Media company Armax )వెల్లడించే సర్వే ఫలితాలు సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి.

ఈ సంస్థ అక్టోబర్ నెలలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన నటీనటుల జాబితాను వెల్లడించింది.

దేశవ్యాప్తంగా నటీనటుల జాబితాను ఈ సంస్థ వెల్లడించగా ఆ జాబితా వైరల్ అవుతోంది.ఈ జాబితాలో స్టార్ హీరో ప్రభాస్ ( Star hero Prabhas )తొలి స్థానంలో ఉండటం గమనార్హం.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్( Kollywood Star Hero Vijay ) కు ఈ లిస్ట్ లో రెండో స్థానం దక్కింది.బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) ఈ లిస్ట్ లో మూడో స్థానంలో నిలవగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Young Tiger Jr.NTR ) కు నాలుగో స్థానం దక్కింది.కోలీవుడ్ హీరో అజిత్ ఐదో స్థానంలో నిలవగా బన్నీకి ఆరో స్థానం దక్కడం గమనార్హం.

త్వరలో పుష్ప ది రూల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న బన్నీ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే తన స్థానాన్ని మరింత మెరుగుపరచుకోవడం పక్కా అని చెప్పవచ్చు.

Most Popular Heroes List In National Wide Details Inside Goes Viral In Social Me
Advertisement
Most Popular Heroes List In National Wide Details Inside Goes Viral In Social Me

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాల్లో నటించకపోయినా ఈ లిస్ట్ లో ఏడో స్థానం దక్కింది.కోలీవుడ్ హీరో సూర్య ( Kollywood hero Surya )ఈ జాబితాలో ఎనిమిదో స్థానం దక్కడం గమనార్హం.సూర్య తాజాగా కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.

సినిమా తొలి అరగంట కంగువ మూవీకి ఊహించని స్థాయిలో మైనస్ అయింది.

Most Popular Heroes List In National Wide Details Inside Goes Viral In Social Me

ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో రామ్ చరణ్ నిలవగా పదో స్థానంలో సల్మాన్ ఖాన్ నిలిచారు.హీరోయిన్ల విషయానికి వస్తే సమంత తొలి స్థానంలో నిలవగా అలియా భట్, నయనతార తర్వాత స్థానాల్లో నిలిచారు.దీపిక, త్రిష, కాజల్ నాలుగు, ఐదు, ఆరు స్థానాలలో నిలవడం గమనార్హం.

శ్రద్ధా కపూర్, సాయిపల్లవి, రష్మిక, కత్రినా కైఫ్ లకు మిగతా స్థానాలు దక్కాయి.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు