ఈ ఐదుగురు భామలకు 2023 కీలకంగా మారనుందా?

ఏ ఇండస్ట్రీలో అయినా కొత్త హీరోయిన్స్ వస్తూనే ఉంటారు.పాత హీరోయిన్స్ ఉన్నప్పటికీ కొత్త హీరోయిన్స్ రావడం అనేది సహజమే.

 Most Crucial For These Five Actress This Year, Krithi Shetty, Pooja Hegde,  Mahe-TeluguStop.com

ఇప్పుడు హీరోయిన్ లకు డిమాండ్ బాగా ఉండడంతో వారు కూడా బిజీ అయిపోతున్నారు.ప్రెజెంట్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐదుగురు హీరోయిన్స్ మోస్ట్ వాంటెండ్ గా ఉన్నారు.

అయితే ఈ ఐదుగురు ముగ్గుగుమ్మలు ఈ ఏడాది కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లుగా కొనసాగాలి అంటే వారు చేస్తున్న సినిమాలు పక్కాగా హిట్ అవ్వాల్సిన పరిస్థితి.మరి ఆ హీరోయిన్స్ ఎవరో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రష్మిక మందన్న :

ఈమె గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు.ఈమె పుష్ప తర్వాత పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది.

దీంతో ఈమెకు పుష్ప 2 మినహా పెద్దగా అవకాశాలు తెలుగులో లేవు.మరి పార్ట్ 2 రిలీజ్ అయితే కానీ ఈమె తెలుగులో మరిన్ని అవకాశాలు పొందే ఛాన్స్ ఉంది.

పూజా హెగ్డే :

ఈమె తిరుగులేని స్టార్ డమ్ దక్కించుకుంది.కానీ ఇటీవల కాలంలో వరుస ప్లాప్స్ కారణంగా ఈమె క్రేజ్ తగ్గింది అనే చెప్పాలి.

ప్రెజెంట్ తెలుగులో త్రివిక్రమ్-మహేష్ సినిమాలో నటిస్తుంది.ఈ సినిమా హిట్ అయితే కానీ ఈమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.

Telugu Dasara, Keerthy Suresh, Kiara Advani, Krithi Shetty, Mahesh Babu, Nani, P

కీర్తి సురేష్ :

ఈమె మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ అయిపొయింది.కానీ ఈ సినిమా తర్వాత ఈ అమ్మడికి ఇంత పేరు తెచ్చిపెట్టిన సినిమాలు లేవనే చెప్పాలి.ప్రెజెంట్ ఈమె నాని దసరా సినిమా చేస్తుంది.ఇది ఈమె కెరీర్ కు అత్యంత కీలకం అనే చెప్పాలి.ఈ సినిమా హిట్ అయితే కానీ ఈమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.

Telugu Dasara, Keerthy Suresh, Kiara Advani, Krithi Shetty, Mahesh Babu, Nani, P

కృతి శెట్టి :

ఉప్పెన సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు అయితే వరించాయి కానీ ఈమెకు మంచి హిట్ అయితే పడడం లేదు.ప్రెజెంట్ నాగ చైతన్య ‘కస్టడీ‘ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాతో హిట్ కొడితేనే మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.

Telugu Dasara, Keerthy Suresh, Kiara Advani, Krithi Shetty, Mahesh Babu, Nani, P

కియారా అద్వానీ :

ఈమె బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ తెలుగులో కూడా సినిమాలు చేస్తుంది.ప్రెజెంట్ ఈమె రామ్ చరణ్ తో ఆర్సీ15 సినిమాలో నటిస్తుంది.ఈ సినిమా హిట్ అయితేనే ఈమెకు తెలుగు స్టార్ హీరోలు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube