2023లో 59 వేల మందికి పైగా భారతీయులు అమెరికా పౌరసత్వం పొందారని యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ సిటిజన్‌షిప్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) తెలిపింది.2023 ఆర్ధిక సంవత్సరంలో దాదాపు 8.7 లక్షల మంది విదేశీ పౌరులు అమెరికా పౌరులుగా మారారని గణాంకాలు చెబుతున్నాయి.వీరిలో 1.1 లక్షల మంది మెక్సికన్లు (12.7 శాతం), 59,100 మంది భారతీయులు (6.7 శాతం), డొమినికన్ రిపబ్లిక్( Dominican Republic ) (35,200), ఫిలిప్పిన్స్( Philippines ) (44,800) మంది వున్నారు.అమెరికా పౌరసత్వాన్ని పొందేందుకు ఇమ్మిగ్రేషన్ జాతీయత చట్టం (ఐఎన్ఏ)లో పేర్కొన్న కొన్ని అర్హతలు తప్పనిసరి.
అమెరికా పౌరసత్వం కోరుతున్న వ్యక్తి కనీసం ఐదేళ్లపాటు చట్టబద్ధమైన శాశ్వత నివాసి అయి వుండాలి.

కరోనా కారణంగా 2020 మార్చిలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని వీసా ప్రాసెసింగ్‌లను వాషింగ్టన్ నిలిపివేసిన సంగతి తెలిసిందే.వీసా సేవలను తిరిగి ప్రారంభించడంతో పాటు బ్యాక్‌లాగ్‌లను క్లియర్ చేయడానికి అమెరికా( America ) ప్రయత్నిస్తోంది.కొన్ని సందర్భాల్లో వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయులు ఏడాది పాటు అపాయింట్‌మెంట్ కోసం వేచిచూడాల్సిన పరిస్ధితి నెలకొంది.అయితే 2023లో రికార్డ్ స్థాయిలో 1.4 మిలియన్ వీసాలు ప్రాసెస్ చేయబడిన తర్వాత ఈ నిరీక్షణ సమయం కొంతమేర తగ్గిందని యూఎస్ ఎంబసీలు, కాన్సులేట్‌లు తెలిపాయి.భారత్ ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, గుజరాత్‌కు చెందిన భారతీయులు అమెరికన్ పౌరసత్వాన్ని అత్యధికంగా పొందినవారిలో వున్నారు.వీరిలో ఎక్కువ మంది ఉద్యోగాలు వెతుక్కుంటూ అమెరికాలో అడుగుపెట్టాలని చూస్తున్నారు.
కొందరు అక్రమ మార్గంలో అగ్రరాజ్యానికి వలస వెళ్లాలని భావిస్తున్నారు.

ఇకపోతే.2022-23 ఆర్ధిక సంవత్సరంలో అత్యధికంగా 96,917 మంది భారతీయులు అమెరికా సరిహద్దులు దాటుతూ పట్టుబడ్డారని ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖ శాఖ పార్లమెంట్‌లో ప్రకటించింది.గడిచిన ఐదేళ్లలో సుమారు 2,00,000 మంది భారతీయులు అక్రమంగా సరిహద్దులు దాటుతూ అమెరికా అధికారులకు పట్టుబడ్డారని తెలిపింది.2018-19 లో 8027 మంది, 2019 – 20లో 1227 మంది, 2020-21లో 30662 మంది, 2021-22లో 63927, 2022-23లో 96,917 మంది భారతీయులను అమెరికా అధికారులు పట్టుకున్నట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ .మురళీధరన్ తెలిపారు.అలా సరిహద్దులు దాటిన భారతీయ అక్రమ వలసదారుల సంఖ్య 2,00,760కి చేరుకుంది.