అమెరికాకు సాధ్యం కానిది న్యూజిలాండ్ చేసి చూపిస్తోంది

అమెరికాలో రోజు రోజుకి పెరుగుతున్న గన్ కల్చర్ కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే.దీనిని అరికట్టేందుకు ఫెడరల్ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం మాత్రం శూన్యం.

 More Than 56000 Guns Handed Back To New Zealand Authorities-TeluguStop.com

అయితే అమెరికాకు సాధ్యం కానిదానిని న్యూజిలాండ్ ఆచరణలో సుసాధ్యం చేసి చూపించింది.ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆ దేశ వాసులు గడచిన ఆరు నెలల కాలంలో సుమారు 56,000 తుపాకులను పోలీసులకు అప్పగించారు.

ఈ ఏడాది క్రైస్ట్ చర్చ్‌లోని రెండు మసీదుల వద్ద జరిగిన కాల్పుల ఘటనలో 51 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత న్యూజిలాండ్ ప్రభుత్వం స్పందించింది.మనుషుల ప్రాణాలను తీస్తున్న బలి తీసుకుంటున్న సెమీ-ఆలోమేటిక్ తుపాకులను నిషేధించడంతో పాటు ఆయుధాల బై-బ్యాక్ పథకాన్ని ప్రారంభించారు.

మార్చి 15 కాల్పుల తర్వాత వారాల వ్యవధిలో న్యూజిలాండ్ పార్లమెంట్ ఈ నిషేధాన్ని ఆమోదించింది.

Telugu Guns, Zealand, Firearm-

ఏప్రిల్‌లో అమల్లోకి వచ్చిన ఈ బై-బ్యాక్ పథకంలో భాగంగా యజమానులు తుపాకులను ప్రభుత్వానికి అప్పగిస్తే.అందుకు బదులుగా ఆయుధాల అసలు ధరలో 95% వరకు పరిహారం ఇవ్వబడుతుంది.ప్రభుత్వ పిలుపుతో ప్రజల్లో కదలిక వచ్చింది.

డిసెంబర్ 20 నాటికి ఆరు నెలల కాలంలో సుమారు 56,000 తుపాకులను జనం తిరిగి ఇచ్చివేసినట్లు పోలీస్ శాఖ మంత్రి స్టువర్ట్ నాష్ తెలిపారు.అయితే ఈ పథకం కౌన్సిల్ ఆఫ్ లైసెన్స్, ఫైర్‌ఆర్మ్స్ యజమానులతో పాటు కొందరి నుంచి విమర్శలను ఎదుర్కొంది.2016 లెక్కల ప్రకారం దేశంలోని ప్రతి నలుగురిలో ఒకరి దగ్గర సుమారు 1.2 మిలియన్ల తుపాకులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ ఏడాది మార్చి 15న క్రైస్ట్‌చర్చిలోని అల్‌నూర్ మసీదులో ముగ్గురు అగంతకులు మారణహోమం సృష్టించారు.ప్రార్థన చేస్తున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడటంతో 49 మంది మరణించగా.

మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటనలో 9 మంది వరకు భారతీయులు మరణించినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.

మసీదులో ప్రార్థనలకు హాజరవ్వాల్సిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సభ్యులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube