పోస్ట్​లో అతగాడికి ఏకంగా 40వేలకుపైగా రాఖీలు, గ్రీటింగ్ కార్డ్​లు వచ్చాయి.. ఆయన ఎవరో తెలుసా?

రక్షాబంధన్ వారం నడుస్తోంది.మీలో ఎంతమందికి ఎన్ని రాఖీలు కట్టారు.

 More Than 40,000 Rakhis And Greeting Cards Were Sent To Him In The Post ,  Rakhi-TeluguStop.com

మీ సోదరీలు మీకు దూరంలో ఉంటే, మీకు ఎన్ని రాఖీలు పంపి వుంటారు? ఓ పది.లేదా ఇరవై… వచ్చి ఉంటాయా? అవే ఎక్కువని ఫీల్ అవుతున్నారా? అయితే వందల, వేల సంఖ్యలో అతగాడికి రాఖీలు, గ్రీటింగ్ కార్డులు వచ్చి పడ్డాయి.కాస్త ఇంటరెస్టింగ్ గా వుంది కదూ.మీరు విన్నది నిజమే… కొన్ని సంవత్సరాలుగా రక్షాబంధన్​ సమయంలో హరియాణాలోని రోహ్​తక్​ పోస్టాఫీసు ఉద్యోగులు విచిత్ర సమస్యని ఎదుర్కొంటున్నారు.

Telugu Thousand, Dera Baba, Gurmeetram, Haryana, Rakhi, Latest-Latest News - Tel

దాదాపు ఓ నాలుగేళ్లుగా సునారియా జైలులో ఉన్న “డేరా బాబా అలియాస్​ గుర్మీత్​ రామ్​ రహీమ్​ సింగ్“​కు వేలకొలది రాఖీలను వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పంపించడంతో అక్కడి అధికారులు తలలు పట్టుకుంటున్నారు.వాటిని వేరు చేసి, జైలుకు తరలించలేక తపాలా ఉద్యోగులు నానాపాట్లు పడుతున్నారు.అందుకోసం ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకుంటున్నారు పాపం.గతేడాది సుమారు 40 వేల రాఖీలు వచ్చాయని.ఈ సారి పూర్తిగా లెక్కింపు జరగలేదని పోస్టాఫీస్​ ఉద్యోగులు తెలపడం గమనార్హం.

Telugu Thousand, Dera Baba, Gurmeetram, Haryana, Rakhi, Latest-Latest News - Tel

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రామ్​ రహీమ్​ పేరుతో పోస్టులు అక్కడికి వచ్చి చేరుతున్నాయి.ఈ సంవత్సరం ఇప్పటికే ఎనిమిది బస్తాల రాఖీలు వచ్చాయట.ఆటోలో తీసుకెళ్లి కొన్ని రాఖీల బస్తాలను జైలుకు తరలిస్తున్నారట.

రక్షాబంధన్​ అయ్యాక కూడా పదిహేను రోజుల వరకు వస్తూనే ఉండటం గమనార్హం.గతేడాది 40,000 రాఖీలు రాగా ఈసారి అంతకంటే ఎక్కువ వచ్చాయని చెబుతున్నారు.

ఈ సారి ఎక్కువగా రావడంతో పోస్టాఫీస్ అధికారులు వాటిని లెక్కపెట్టడానికి సాహసం చేయలేకపోయారట.ఒక దొంగ బాబాకి ఈ రేంజులో పలుకుబడి ఏమిటని అక్కడి జైలు అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారట!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube