అయిపొయింది.అనుకున్నదంతా జరిగింది.మళ్ళీ బాలీవుడ్ లో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది.ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ కు మళ్ళీ నిరాశనే ఎదురైంది.కరోనా తర్వాత బాలీవుడ్ చాలా కష్టాలను ఎదుర్కొంటుంది.ఒకవైపు మన సౌత్ ఇండస్ట్రీ వరుస హిట్స్ అందుకుంటూ వందల కోట్లను వసూలు చేస్తుంటే.
బాలీవుడ్ మాత్రం ఇప్పటికి కోలుకోలేక పోతుంది.అక్కడి ప్రేక్షకులు ఎన్ని సినిమాలు వస్తే అన్ని సినిమాలను రిజక్ట్ చేస్తున్నారు.
దీంతో బాలీవుడ్ లో పాండమిక్ తర్వాత ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా పడలేదు.కరోనా తర్వాత రిలీజ్ అయినా సినిమాల్లో భారీ ఓపెనింగ్స్ తెచ్చిన సినిమాలు లేవనే చెప్పాలి.
మొన్న మొన్ననే వచ్చిన భూల్ భూలయ్య మాత్రం పర్వాలేదు అనేలా రెండంకెల ఓపెనింగ్స్ రాబట్టింది.ఏది ఏమైనా భారీ ఓపెనింగ్స్ రాబట్టి బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచినా ఒక్క సినిమా కూడా లేదు అనే చెప్పాలి.
ఈ మధ్య కాలంలో అక్కడ రెండెంకెల ఓపెనింగ్స్ తేవడమే గగనం అయిపోయింది.20 కోట్ల ఓపెనింగ్స్ కూడా తేలేక చేతులెత్తేస్తున్నాయి.ఈసారి కూడా బాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోలు రెండెంకెల ఓపెనింగ్స్ తేలేక పోయారు.అక్కడ స్టార్స్ తో పాటు ప్రేక్షకులు కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
కానీ ఈసారి కూడా వీరి ఆశలు నెరవేరలేదు.

ఆగష్టు 11న రెండు భారీ ప్రాజెక్టులు రిలీజ్ అయ్యాయి.రెండు కూడా ఓపెనింగ్స్ కూడా తేలేక చేతులెత్తేశాయి.బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, కరీనా కపూర్ కలిసి జంటగా నటిస్తున్న సినిమా లాల్ సింగ్ చద్దా.
ఈ సినిమా ఆగష్టు 11న రిలీజ్ అయ్యి నిరాశ పరిచింది.పాజిటివ్ రాకపోవడం ఈ సినిమా వసూళ్లపై భారీ ప్రభావం చూపించింది.ఈ సినిమా ఇండియా మొత్తం కలిపి కూడా 11 నుండి 12 కోట్ల లోపు మాత్రమే వసూళ్లు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఇది అమీర్ ఖాన్ వంటి భారీ స్టార్ కు అతి తక్కువ ఓపెనింగ్స్ అనే చెప్పాలి.

అలాగే అక్షయ్ కుమార్ హీరోగా నటించిన రక్షా బంధన్ కూడా ఇదే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా అయితే 9 కోట్లు కూడా రాబట్టలేక పోయింది అని లెక్కలు వస్తున్నాయి.బాలీవుడ్ లోనే బిగ్ స్టార్స్ అయినా అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ సినిమాలకు కూడా ఇంత తక్కువ ఓపెనింగ్స్ రావడంతో చెత్త ఓపెనింగ్స్ అంటూ విమర్శలు చేస్తున్నారు.మొత్తానికి మరోసారి బాలీవుడ్ కు నిరాశనే ఎదురైంది.







