మోపిదేవి' మర్యాద కాపాడుకుంటారా ?

వైసిపి సీనియర్ నేత , జగన్ కు అత్యంత సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ( Mopidevi Venkataramana )జగన్ తీరుపై సంతృప్తితో ఉన్నారని,  పార్టీ మారుతారనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది.దీనికి కారణం రేపల్లె నియోజకవర్గ ఇన్చార్జిని మార్చడమే కారణం.2014 , 19 ఎన్నికల్లో వరుసగా మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు.2019లోను ఓటమి చెందినా,  ఆయనకు ఎమ్మెల్సీగా జగన్ అవకాశమిచ్చి మంత్రిని చేశారు.ఆ తర్వాత శాసనమండలని రద్దు చేసే ప్రతిపాదన తెరపై రావడంతో ముందుగానే మంత్రి పదవికి రాజీనామా చేయించి , ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు.అయితే 2024 ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుంచి మోపిదేవిని రంగంలోకి దింపినా .ఓటమి చెందే అవకాశం ఉందనే సర్వే నివేదికలతో జగన్ అలర్ట్ అయ్యారు.నియోజకవర్గ ఇన్చార్జి మార్చారు.

 Mopidevi Venkataramana Political Strategy In Ap, Ysrcp, Mopidevi Venkataramana,-TeluguStop.com

అయితే ఈ మార్పు పై మోపిదేవి వెంకటరమణ అసంతృప్తితో ఉన్నారని , పార్టీ మారే ఆలోచన చేస్తున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది.రేపల్లె  వైసీపీ ఇంచార్జీ గా  గణేష్( Ganesh ) ను జగన్ నియమించారు.

Telugu Ap Cm, Jagan, Repalle, Repalleysrcp, Ysrcp-Politics

ఈ నియామకంపై మోపిదేవి వసంతృప్తితో ఉన్నారనే వార్తలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి.అయితే వాస్తవంగా చూసుకుంటే మొదటి నుంచి మోపిదేవి వెంకటరమణకు జగన్( YS jagan ) బాగానే ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు.వరుసగా రెండుసార్లు ఓడినా ఎమ్మెల్సీగా, మంత్రిగా, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు.వచ్చే ఎన్నికల్లో వెంకటరమణను పోటీకి దించినా,  ఆయన ఓటమి చెందుతారనే లెక్కలతో నియోజకవర్గ ఇన్చార్జిని మార్చారు .ఈ కారణాలతో మోపిదేవి పార్టీకి దూరమైతే నష్టపోయేది ఆయనే అనే అభిప్రాయాలు వైసిపి నేతల నుంచే వ్యక్తమవుతున్నాయి.

Telugu Ap Cm, Jagan, Repalle, Repalleysrcp, Ysrcp-Politics

ఎందుకంటే జగన్ మోపిదేవికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం కంటే ఎక్కువ ఇచ్చారని,  ఆ విషయాన్ని ఆయన అర్థం చేసుకుని అక్కడ పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తే జగన్ దగ్గర ఆయన ప్రాధాన్యం మరింతగా పెరుగుతుంది అని,  అలా కాకుండా అసంతృప్తికి గురై పార్టీకి దూరంగా ఉంటే.మొదటికే మోసం వస్తుందనే అభిప్రాయాలు పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube