2023లో రూ.42 లక్షల విలువైన ఫుడ్ ఆర్డర్ చేసిన సింగిల్ యూజర్..!!

సాధారణంగా ఒక మనిషి ఒక ఏడాదిలో ఆహారం కోసం లక్ష ఖర్చు పెడతాడేమో.మహా అంటే ఐదు లక్షలు ఖర్చు పెట్టొచ్చు.కానీ ముంబైకి( Mumbai ) చెందిన ఒక వ్యక్తి మాత్రం ఏకంగా రూ.42.3 లక్షలు ఖర్చు చేశాడు, అంటే రోజుకు సగటున రూ.11,500.ఈ విషయాన్ని స్విగ్గీ( Swiggy ) లేటెస్ట్ రిపోర్ట్ తెలిపింది.భారతదేశంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సర్వీస్ అయిన స్విగ్గీ ఇటీవల తన 2023 ‘స్విగ్గీ వ్రాప్’ రిపోర్ట్‌ను( Swiggy Wrap Report ) విడుదల చేసింది, దీని ద్వారా స్విగ్గీ కస్టమర్లు, ఆర్డర్‌ల గురించి కొన్ని ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్, ట్రెండ్స్‌ను వెల్లడించింది.ఆ రిపోర్ట్ ప్రకారం, ముంబైకి చెందిన ఒక వ్యక్తి 2023లో ఫుడ్ ఆర్డర్‌ల కోసం ఏకంగా రూ.42.3 లక్షలు వెచ్చించాడు.దీని గురించి సోషల్ మీడియాలో షేర్ చేయగా చాలా మంది ఇంటర్నెట్ యూజర్లను దిగ్భ్రాంతికి గురవుతున్నారు,

 Swiggy User In Mumbai Ordered Food Worth Rs 42 Lakh In 2023 Details, Swiggy, Wra-TeluguStop.com

ఈ వ్యక్తి ఇంత విలాసవంతమైన జీవనశైలిని ఎలా గడుపుతున్నాడు అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.ముంబై ఆర్థిక రాజధాని మాత్రమే కాదు, భారతదేశానికి ఆహార రాజధాని అని కూడా కొందరు చమత్కరించారు.ఎప్పట్లాగానే ఈసారి కూడా ఆర్డర్స్ లో ఎక్కువగా బిర్యానీ( Biryani ) ఆర్డర్స్‌యే వచ్చాయి.నివేదికలోని మరో చెప్పుకోదగిన అంశం ఏంటంటే, భారతదేశం 2023లో ప్రతి సెకనుకు 2.5 బిర్యానీలు ఆర్డర్ చేయడం జరిగింది.

ఒక హైదరాబాదీ కస్టమర్( Hyderabad Customer ) సంవత్సరంలో 1,633 బిర్యానీలు లేదా రోజుకు నాలుగు కంటే ఎక్కువ బిర్యానీలను ఆర్డర్ చేశారు.చండీగఢ్ కూడా బిర్యానీపై ఉన్న ప్రేమతో చాలా మందిని ఆశ్చర్యపరిచింది, ఇండియా వర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఒక కుటుంబం 70 ప్లేట్ల బిర్యానీని ఆర్డర్ చేసింది.అయితే, అందరూ బిర్యానీని ఇష్టపడేవారు కాదు.బిర్యానీకి పేరుగాంచిన హైదరాబాద్‌కు చెందిన ఓ వినియోగదారుడు 6 లక్షలు వెచ్చించి ఇడ్లీలు, స్టీమ్డ్ రైస్ కేక్ కోసం ఖర్చు చేశాడు.

స్విగ్గీ ర్యాప్ నివేదిక భారతీయుల ఆహార ప్రాధాన్యతలు, అలవాట్లపై ఒక అవగాహనను ఇస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube