టమాటా( Tomato ) పేరు ఎత్తితేనే ఇరు తెలుగు రాష్ట్రాల్లోని సామాన్యులు బెంబేలెత్తిపోతున్న పరిస్తితి నెలకొంది.కారణం అందరికీ తెలిసినదే.
గత రెండు నెలలుగా టమాటా ధరలతో సామాన్యుల నడ్డి విరుగుతోంది.టమాటా లేనిదే వంటలు చేయలేని మహిళలు టమాటా అన్న ఊసే ఎత్తడం మానేశారు.
ఇక టమాటాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో కొందరు వ్యాపారులు రాత్రికి రాత్రి కోటీశ్వరులైపోయారు.మరోవైపు, ఈ మధ్య దొంగలు బంగారం, వెండి బదులు టమాటాలను దొంగతనం చేస్తున్నారు.

ఇటీవల టామాటా లోడ్‌తో బయలుదేరిన లారీ అకస్మాత్తుగా అదృశ్యమైన ఘటన ఎంతటి కలకలం సృష్టించిందో అందరికీ తెలిసిందే.టమాటాలకు ప్రస్తుతం ఉన్న డిమాండ్ అలాంటిది మరి.అయితే టమాటా డిమాండ్ గురించి కోతులకు, కొండముచ్చులకు( Monkeys ) కూడా తెలిసిందో ఏమో గానీ అవి కూడా వాటినే టార్గెట్ చేస్తున్న ఘటనలు ఈమధ్య మనం చూస్తూ వున్నాం.ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో ఓ కోతి వంటింట్లోకి వచ్చి( Kitchen ) మరీ టామాటాను తీసుకెళ్లడం మనం చూడవచ్చు.

మొదట చాలా కూల్ గా లోపలికొచ్చిన కొండముచ్చు ప్లాస్టిక్ బుట్టలో ఉన్న బంగాళదుంపను కొరికింది.మరి ఇంతలో దానికి బోరు కొట్టిందో ఏమో కానీ ఆ పక్కనే ఉన్న టమాటాను టార్గె్ట్ చేసింది.చేతిలోని ఆలుగడ్డను( Potato ) నోటిలో పెట్టుకుని మరో చేత్తో టమాటా అందుకుని అక్కడినుండి తుర్రున పారిపోయింది.
కాగా ఈ వీడియోని చూసిన నెటిజన్లు తెగ నవ్వుతున్నారు.ఇంకేముంది కట్ చేస్తే ఈ వీడియోకు ఇప్పటివరకూ సుమారు 3 లక్షల వ్యూస్ వచ్చాయి.కొండముచ్చు తీరు చూసి నెటిజన్లు షాకయిపోతున్నారు.ఇక కొందరు ఆ ఇంటి ఓనర్‌పై కూడా సెటైర్లు వేస్తున్నారు.
ఇంట్లో అన్ని టామాలు పెట్టుకుంటే ఈడీ అధికారులు రెయిడ్ చేస్తారంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు.మీరు కూడా ఈ వీడియోని చూసి కామెంట్స్ చేయండి.







