వైరల్ వీడియో: పర్యాటకుడిని భయపెట్టలేకపోయిన కోతి.. ఎలా ఫీల్ అయిందో చూస్తే...

కోతులు మనుషులను భయపెట్టి తెగ సంతోషపడిపోతాయి.కానీ ఓ కోతి ఆ విషయంలో ఫెయిల్ అయింది.

 Monkey Reaction After Failed Attempt To Scare Tourists Video Viral Details, Monk-TeluguStop.com

పర్యాటకుడిని( Tourist ) అది భయపెట్టేందుకు ప్రయత్నించింది కానీ అతడు భయపడలేదు.దాంతో కోతి( Monkey ) డిసప్పాయింట్ అయింది.

దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారనే వివరాలు తెలియ రాలేదు కానీ ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో రీసెంట్ గా పోస్ట్ చేయబడింది.దీనికి 19 మిలియన్లకు పైగా వ్యూస్, 1.3 మిలియన్ లైకులు వచ్చాయి.

రెయిలింగ్‌పై కోతి పక్కన నిలబడి ఉన్న పర్యాటకుడును వీడియోలో మనం చూడవచ్చు.ఆయన కోతితో కలిసి ఫోటోలు దిగుతున్నాడు.అప్పుడు కోతి వచ్చి పర్యాటకుడి చేయి పట్టుకుంది.అది టూరిస్ట్‌ని కాటు వేయాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది, కానీ పర్యాటకుడు భయపడలేదు.

పర్యాటకుడు నవ్వుతూ కెమెరాకు పోజులు ఇస్తున్నాడు.కోతి ఆశ్చర్యంగా, విచారంగా ఉంది.

పర్యాటకుడు ఎందుకు భయపడలేదో దానికి అర్థం కావడం లేదు.

కోతి టిబెటన్ మకాక్.( Tibetan Macaque ) ఇది చైనా, కొన్ని ఇతర ఆసియా దేశాలలో నివసించే ఒక రకమైన కోతి.వీడియో చూసిన కొందరు కోతి తమకు తెలుసని చెప్పారు.

దాని పేరు జింగ్ జింగ్( Xing Xing ) అని వారు చెప్పారు.జింగ్ జింగ్ చైనాలోని( China ) పాపులర్ కోతి.

దానికి ఒక చేయి మాత్రమే ఉంటుంది.ఇది జెజియాంగ్ ప్రావిన్స్‌లోని నింగ్బోలోని ఒక ఆలయంలో నివసిస్తుంది.

జింగ్ జింగ్‌కు విచారకరమైన గతం ఉంది.ఒక ఉచ్చులో అది తన చేతిని కోల్పోయింది.

ఇది కూడా ఒక సర్కస్, ఒక రెస్టారెంట్ లో కాలం గడిపింది.అప్పట్లో అది చాలా బాధ పడింది.

కానీ ఇప్పుడు సంతోషంగా, సురక్షితంగా ఉంది.ఒక బౌద్ధ సన్యాసిని ఆలయం వద్ద దానిని చూసుకుంటుంది.జింగ్ జింగ్‌ని చూడటానికి చాలా మంది ఆలయాన్ని సందర్శిస్తారు.జింగ్ జింగ్, పర్యాటకుడి వీడియోపై చాలా మంది పాజిటివ్ కామెంట్స్ చేశారు.జంతువులు నీచంగా ఉండవని కొందరు అన్నారు.అవి భయపడినప్పుడు మాత్రమే దాడి చేస్తాయని పేర్కొన్నారు.

జింగ్‌ జింగ్‌కి మొదట్లో టూరిస్ట్స్‌ అంటే భయమని కొందరు చెప్పారు.జింగ్ జింగ్‌ను సంతోషపెట్టడానికి పర్యాటకుడు భయపడినట్లు నటిస్తే బాగుండేదని కొందరు అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube