కొలంబియాకు చెందిన ఓ ప్రాంక్ ప్రపోజల్( Prank ) వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది.ఈ వీడియో ప్రకారం, తన గర్ల్‌ఫ్రెండ్‌కి పెళ్లి చేసుకోమని అడగడానికి ఊహించని మార్గాన్ని ఓ బాయ్‌ఫ్రెండ్ ప్లాన్ చేశాడు.
కొలంబియా( Colombia )లోని కాలి అనే నగరంలో రెడ్ కలర్ కారు వెళ్తూ వస్తుండటంతో వీడియో ప్రారంభమవుతుంది.తరువాత ఒక కూడలిలో కారు ఆగింది.
అప్పుడు, వీధిలో నడుస్తున్న ఒక వ్యక్తి, మోటార్ సైకిల్ నడుపుతున్న వ్యక్తి కారును అడ్డుకున్నారు.కారును దోచుకోవాలన్నట్లుగా వారు వ్యవహరించారు.

మరో ఇద్దరు వ్యక్తులు కూడా వచ్చి కారులో ఉన్న యువతిని, పురుషులను బయటకు రావాలంటూ భయపెట్టారు.ఆ జంట భయపడి అయోమయంలో పడ్డారు.వారు చెప్పినట్లు చేశారు.ఇది నిజమైన దోపిడీలానే కనిపిస్తోంది.అందుకే గర్ల్‌ఫ్రెండ్ ( Girlfriend )బాగా భయపడిపోయింది.అయితే అప్పుడే ఓ అనుకోని సంఘటన జరుగుతుంది.
ఈ దొంగల్లో ఒకరిగా వచ్చిన బాయ్ ఫ్రెండ్ నేలపై గర్ల్‌ఫ్రెండ్ ముందు మోకరిల్లి ఒక ఉంగరం చూపించాడు.తనను పెళ్లి చేసుకోమని అడిగాడు.

గర్ల్‌ఫ్రెండ్ కి అప్పటికి గానీ అది ప్రాంక్ అని, తన బాయ్ ఫ్రెండ్ ఇదంతా ప్లాన్ చేశాడని అర్థం కాలేదు.మొదట ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది తర్వాత ఇలా భయపడతావా అని కోపంతో అతడిని చిలిపిగా కొట్టేసింది.ఆపై ఆమె ఏడవడం, నవ్వడం ప్రారంభిస్తుంది.చివరికి బాయ్ ఫ్రెండ్ ప్రపోజల్ కు “ఎస్” అని చెప్పింది.ఇంకేముంది, వారు కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నారు.చుట్టుపక్కల ప్రజలు చప్పట్లు కొట్టి వారికోసం ఆనందం వ్యక్తం చేశారు.
దొంగలుగా నటించిన మిగతా వారందరూ నిజానికి బాయ్ ఫ్రెండ్ స్నేహితులు.వారు ప్రపోజల్ సమయంలో అతనికి సహాయం చేసారు.
ఈ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో పలు రకాల స్పందనలు వస్తున్నాయి.కొంతమంది ప్రపోజల్ చాలా సృజనాత్మకంగా, ఫన్నీగా ఉందని కామెంట్లు చేశారు.
ఇది అత్యుత్తమ ప్రపోజల్ అని కొందరు అంటే, కొంతమంది మాత్రం ఈ ప్రపోజల్ చాలా ప్రమాదకరమైనది అని అన్నారు.ఎవరైనా ఇలా ప్రపోజ్ చేస్తే తాము కచ్చితంగా నో చెప్పేస్తామని లేడీ నెటిజన్లు అంటున్నారు.







