ప్రస్తుత కాలంలో కొందరు కేటుగాళ్లు టెక్నాలజీ డెవలప్ అవడంతో సాంకేతిక పరంగా కాకుండా మనుషులకు మాయ మాటలు చెప్పి ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు.తాజాగా ఓ వ్యక్తి తాను ఇండియన్ ఆర్మీ లో పని చేస్తున్నానంటూ ఓ హోటల్ కి ఫోన్ చేసి పూరీ ఆర్డర్ చేస్తూ ఏటీఎం నెంబరు చెబితే డబ్బులు పంపిస్తానని చెప్పి మరి 25 వేల రూపాయలను నొక్కేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఓ హోటల్ కి తాను తాను ఆర్మీ ఆఫీసర్ అని తనకు 50 ప్లేట్ల పూరీ పార్సల్ కావాలని తొందర్లోనే వచ్చి తీసుకుంటానని ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు.దీంతో హోటల్ యజమాని ఒక్కసారిగా సంబరపడిపోయాడు.
అయితే ఇక్కడ అంతా బాగానే సాగింది.కానీ ఆ గుర్తు తెలియని వ్యక్తి తాను ఆర్డర్ చేసినటువంటి పూరీలకు బ్యాంక్ అకౌంట్ ద్వారా డబ్బులు పంపిస్తానని కావున అకౌంట్ వివరాలు తెలియ చేయాలని కోరాడు.
దీంతో సదరు యజమాని తనకు తెలిసినటువంటి వారి ఏటీఎం వివరాలను తెలియజేశాడు.
దీంతో ఆ గుర్తు తెలియని వ్యక్తి డబ్బులు పంపించడానికి ఓటీపీ అవసరమని ఇప్పుడు మీ ఫోన్ కి ఓటీపీ వస్తుందని ఆ ఓటీపీ నంబర్ తెలియజేయాలని అడిగాడు.
దీంతో ఓటీపీ చెప్పిన వెంటనే 25 వేల రూపాయలు డబ్బులు డ్రా చేసినట్లు సందేశాలు వచ్చాయి.అయితే ఆ తర్వాత పూరి ఆర్డర్ ఇచ్చినటువంటి వ్యక్తికి ఫోన్ చేస్తున్నప్పటికీ స్విచాఫ్ రావడంతో తాను మోసపోయానని హోటల్ యజమాని గ్రహించాడు.
అనంతరం దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి తనకు జరిగిన అన్యాయం గురించి వివరించి ఫిర్యాదు చేశాడు.దీంతో పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా సరే ఫోన్ చేసి బ్యాంకు వివరాలను అడిగితే చెప్పొద్దని అంటూ హెచ్చరిస్తున్నారు.