అమెరికాలో అక్రమ వలసదారుల దారుణాలు .. జో బైడెన్‌పై హత్యాచార బాధితురాలి తల్లి ఆగ్రహం

అమెరికాలో అక్రమ వలసదారుల కారణంగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి.దోపిడీలు, హత్యలు, బెదిరింపులు, ఘర్షణలు ఇతర నేరాలకు పాల్పడుతూ వారు ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు.

దీంతో అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఇమ్మిగ్రేషన్ విధానాలపై ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.ఎన్నికల్లోనూ ఈ అంశం వారికి ఆయుధంగా మారింది.

డొనాల్డ్ ట్రంప్ అయితే తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరిస్తానని చెబుతున్నారు.కాగా.

జనవరి 2023లో ఎల్ సాల్వడోరన్ వలసదారుల చేతుల్లో అత్యాచారం, హత్యకు గురైన మోరిన్ (37) కేసులో 23 ఏళ్ల విక్టర్ మార్టినెజ్ హెర్నాండెజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ నేపథ్యంలో 2022లో మేరీల్యాండ్‌లోని తన మొబైల్ హౌస్‌లో అక్రమ వలసదారుడి చేతిలో అత్యాచారానికి, హత్యకు గురైన 20 ఏళ్ల కైలా మేరీ హామిల్టన్( Kayla Marie Hamilton ) తల్లి టామీ నోబెల్స్.

Advertisement

అధ్యక్షుడు బైడెన్‌కు ( Joe Biden )ఓ సందేశం పంపారు.

హోంలాండ్ సెక్యూరిటీ , హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్( Health and Human Services ) వారి విధులను సరిగా నిర్వర్తించకపోవడం.పోలీసులు, ప్రభుత్వం వంటి ఏజెన్సీలు నిరోధించకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని టామీ న్యూయార్క్ పోస్టుతో అన్నారు.ఈ రకమైన నేరాలు జరగకుండా నిరోధించడానికి బైడెన్ ప్రయత్నించడం లేదని, ఆయనే ఇక్కడికి వలసదారులకు స్వాగతం పలుకుతున్నారని టామీ మండిపడ్డారు.

ఫెడరల్ , స్థానిక ప్రభుత్వ సంస్థలు బాధ్యత వహించాలని.అమెరికన్ పౌరులను మొదటి స్థానంలో ఉంచాలని , మా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హామిల్టన్, మోరిన్‌ల అత్యాచారం, హత్యలతో పాటు దేశాన్ని కదిలించిన మరో ఘటన అగస్టా యూనివర్సిటీలో 22 ఏళ్ల నర్సింగ్ విద్యార్ధి లేకెన్ రిలే హత్య.ఆమె ఏథెన్స్‌లోని జార్జియా యూనివర్సిటీలో జాగింగ్ చేస్తుండగా హత్యకు గురైంది.నిందితుడిని అక్రమ వలసదారుడైన జోస్ ఆంటోనియో ఇబర్రాగా( Jose Antonio Ibarra ) గుర్తించి, అరెస్ట్ చేశారు.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

అమెరికాలో ఇలాంటి క్రూరమైన సంఘటనలు పునరావృతం కావడం పట్ల నోబెల్స్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.దేశ సరిహద్దులను మూసివేయడం, అక్రమ వలసదారులను .వారి నేపథ్యాన్ని తనిఖీ చేయాలని ఆమె బైడెన్‌ను డిమాండ్ చేశారు.తన బిడ్డ హత్యాచారం నేపథ్యంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్‌పై దావా వేయాలని నోబెల్స్ భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు