NTR : ఆ విషయం లో ఎన్టీయార్ ను తక్కువ అంచనా వేసిన మోహన్ లాల్…

కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమా( Janata Garage movie ) అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది.అయితే ఈ సినిమాతో ఎన్టీఆర్ లో ఉన్న ఒక కొత్త యాంగిల్ అనేది బయటకు వచ్చింది.

 Mohanlal Underestimated Ntr In That Matter-TeluguStop.com

దాంతో పాటుగా ఎన్టీఆర్ మోహన్ లాల్ కాంబినేషన్ లో కూడా ఇది ఒక అద్భుతమైన సినిమాగా నిలిచింది అనే చెప్పాలి.అయితే ఇక ఇదిలా ఉంటే ఆ సినిమా సమయంలో మోహన్ లాల్( Mohan Lal ) కి ఎన్టీఆర్ కి మధ్య ఒక సీన్ ఉంటుంది.

అది ఏంటి అంటే ఎన్టీఆర్( NTR ), మోహన్ లాల్ కి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.ఇక వీళ్ళ కాంబినేషన్ లో తెరకెక్కిన ఫస్ట్ సీన్ ఇదే కావడం తో, ఆ సీన్ కోసం అంత ప్రిపేర్ చేసిన తర్వాత ఆ సీన్ ని ఎన్టీయార్ ఒక 10 టేకులు తీసుకొని చేస్తాడేమో అని మోహన్ లాల్ అనుకున్నాడట.కానీ ఎన్టీఆర్ వచ్చి రాగానే జస్ట్ సింగల్ టేక్ లో ఆ సీన్ మొత్తం ఎక్స్ప్రెషన్స్ తో చేయడమే కాకుండా ఆ డైలాగులు చెప్పడం కూడా చూసిన మోహన్ లాల్ ఎన్టీయార్ యాక్టింగ్ స్కిల్స్ కి గాని, ఆయన చెప్పిన డైలాగ్ డెలివరీలకు గాని ఫిదా అయి పోయాడట.

 Mohanlal Underestimated Ntr In That Matter-NTR : ఆ విషయం లో ఎ-TeluguStop.com

అయితే ఎన్టీఆర్ ని తక్కువ అంచనా వేసిన మోహన్ లాల్ కి ఆ రకంగా ఎన్టీఆర్ షాక్ ఇవ్వడం అనేది నిజంగా ఆశ్చర్యానికి గురి చేసే విషయం అనే చెప్పాలి.దాంతో సెట్ లోనే ఎన్టీఆర్ అంత పెద్ద డైలాగ్ చెప్పడం చూసి మోహన్ లాల్ షాక్ అయ్యాడట,ఎందుకంటే వేరే హీరోలు ఎవరైనా కూడా ఒక 10 టేక్ లు తీసుకొని ఆ డైలాగ్స్ చెప్పేవారు.నువ్వు మాత్రం సింగల్ టేక్ లో చెప్పావ్, వెరీ గుడ్ ఆర్టిస్ట్ అని పొగిడినట్టుగా మీడియాలో కొన్ని కథనాలు కూడా వచ్చాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube