Mohan Sharma Lakshmi : వయసు పెరిగితే సరిపోదు.. 77 ఏళ్లకు ఎందుకు ఇంత పనికిమాలిన వివరణలు

ఎవరైనా స్టార్డం పీక్స్ లో చూసిన తర్వాత లేదా జీవితంలో అన్నీ జరిగిపోయిన తర్వాత చరమాంకానికి చేరుకుని రామ కృష్ణ అనే కాలం వెల్లదీస్తారు.సరే వారి జీవితంలో ఎన్ని తప్పులు అయినా జరిగి ఉండొచ్చు లేదా వాటిని సరిదిద్దుకొని కూడా ఉండొచ్చు.

 Mohan Sharma Wrong Words About Actress Lakshmi-TeluguStop.com

ఏదేమైనా అయిపోయిన గతాన్ని తవ్వుకోవడం ద్వారా ఎవరికి జరిగే లాభం లేదు.ప్రస్తుతం మోహన్ శర్మ( Mohan Sharma ) అనే నటుడు తన మాజీ భార్య ఒక స్టార్ హీరోయిన్, ఒకప్పుడు బాగా సంపాదించింది.

నన్ను మోసం చేసింది.పెళ్లి చేసుకుంటే కుక్కలా పడి ఉంటాను అని చెప్పింది, రూముకు రమ్మంది… గాంధర్వ వివాహం చేసుకున్నాము, ఆ తర్వాత నన్ను మోసం చేసింది , వేరే వారితో వెళ్లిపోయింది అంటూ వగైరా వగైరా ఏదో వాగుతున్నాడు.

Telugu Actress Lakshmi, Bhaskar, Kollywood, Mohan Sharma, Tollywood-Movie

ఈ సదరు మోహన్ శర్మ మరెవరో కాదు.సీనియర్ నటి లక్ష్మీ( Actress Lakshmi ) రెండవ భర్త.ఆమె 17 ఏళ్ల వయసులో భాస్కర్( Bhaskar ) అనే వ్యక్తిని పెద్దలు చూడగా పెళ్లి చేసుకుంది.ఆ జంటకు ఐశ్వర్య పుట్టిన తర్వాత ఐదేళ్ళకే విడాకులు తీసుకున్నారు.

కొన్ని రోజులకు మోహన్ శర్మతో ప్రేమలో పడింది.ఆ కాపురం కూడా ఐదేళ్లకే కుప్ప కూలిపోయింది.

ఆ తర్వాత శివచంద్రన్ అనే మరో దర్శకుడు తో పెళ్లి జరిగింది.వారు కూడా ఏం జరిగిందో ఏమో తెలియదు త్వరగా నే విడిపోయారు.

చివరగా అనంత నాగ్
అనే ఒక నటుడుతో రిలేషన్ షిప్ లో కూడా ఉన్నట్టు ప్రచారం సాగింది.ఆమె జీవితమంతా కూడా ఒడిదురుకులే.

కాపురం అంతా కూడా కకావికలే.

Telugu Actress Lakshmi, Bhaskar, Kollywood, Mohan Sharma, Tollywood-Movie

మరి రెండవ భర్తగా వెళ్లడానికి ముందే లక్ష్మీ జీవితంలో ఏం జరిగిందో మోహన్ శర్మ కు మొత్తం తెలుసు.అలాగే ఒక నటి జీవితం ఎలా ఉంటుందో కూడా తెలుసు.అలా అన్ని తెలిసి కూడా ఈ వయసులో ఆమెకు మనోవేదన మిగిల్చడం కాకపోతే ఇప్పుడు ఆమె గురించి మాట్లాడం ఎందుకు.

ఆమె అలా చేసింది, ఇలా చేసింది, తప్పులు చేసింది అంటూ చెప్పడంలో అర్థమే లేదు.ఇంత వయసు వచ్చిన ఎలా మాట్లాడాలి మీడియా ముందు అనే చిన్న విషయాన్ని మర్చిపోయి దొరికిందే ఛాన్స్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు కొంత మంది.

నిజానికి లక్ష్మికి కుక్కలా పడుండాల్సిన అవసరం లేనేలేదు.ఆ రోజుల్లో ఆమె ఒక స్టార్ హీరోయిన్.బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నటిగా నిర్మాతగా ఆమె చూడని పిక్స్ లేవు.అప్పుడు మోహన్ శర్మ అనే చిన్న నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు లక్ష్మి నిజంగా పెద్ద త్యాగమే చేసింది అనుకోవాలి.

ప్రస్తుతం ఆమె తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ హుందా గా జీవిస్తుంది.ఎక్కడ తన జీవితంలోకి వచ్చిన మొగాళ్ళ గురించి తప్పుగా మాట్లాడింది లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube