మహమ్మద్ సిరాజ్( Mohammed Siraj ) ఐపీఎల్ లో అద్భుతమైన ఆటను ప్రదర్శించి బీసీసీఐ ( BCCI )దృష్టిలో పడ్డాడు.భారత జట్టులో కీలక బౌలర్ బుమ్రా( Bowler Bumrah ) గాయం కారణంగా జట్టుకు దూరం కావడం మహమ్మద్ సిరజ్ కు బాగా కలిసి వచ్చింది.
ఇక బుమ్రా లేని లోటు తీరుస్తూ తనదైన శైలిలో ముందుకు దూసుకు వెళ్తున్నాడు.ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో కీలక ప్లేయర్ గా మారిపోయాడు.
ఐపీఎల్ లో హైదరాబాద్ తరపున అద్భుత ఆటను ప్రదర్శిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక డబ్ల్యూటీసీ ఫైనల్( WTC final Match ) లో కూడా బీసీసీఐ మహమ్మద్ సిరాజ్ కు అవకాశం ఇచ్చింది.
ఈ అవకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్ లోనే ఏకంగా నాలుగు వికెట్లు తీసి ఓ అరుదైన రికార్డ్ ఖాతాలో వేసుకున్నాడు.
ఈ డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ ద్వారా టెస్ట్ ఫార్మాట్ లో 50 వికెట్లు సాధించిన మైలురాయిని పూర్తి చేశాడు.
అంతేకాదు మహమ్మద్ సిరాజ్ ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటివరకు ఆడిన 6 టెస్ట్ మ్యాచ్లలో 22 వికెట్లు తీశాడు.భారత్ కు అవసరమైన కీలక సమయాలలో ఇంగ్లాండ్ బ్యాటర్లను అవుట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించి పెవిలియన్ కు పంపించాడు.
మన అందరికీ తెలిసిందే భారత జట్టులో చోటు దక్కాలంటే ఐపీఎల్ అనేది యువ ఆటగాళ్లకు ఒక మంచి వేదిక.ఐపీఎల్ లో సత్తా ఏంటో బయట పెడితే చాలు భారత జట్టులో చోటు దక్కడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.
మహమ్మద్ సిరాజ్ అలా చేసి భారత జట్టులో చోటు సంపాదించుకొని వరుసగా ఖాతాలో రికార్డులను వేసుకుంటున్నాడు.ఈ అరుదైన రికార్డ్ ను సాధించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.