ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది.ఇటీవల కాలంలో పలువురు సినీ సెలబ్రిటీలు మరణిస్తున్నారు అయితే బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి వారిలో పవిత్ర నాథ్ ( Pavitranath ) ఒకరు పవిత్ర నాథ్ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ మొగలిరేకులు ( Mogali Rekulu ) సీరియల్ లో దయ అంటే మాత్రం టక్కున ఈయన అందరికీ గుర్తుకు వస్తారు.
మొగలిరేకులు సీరియల్ లో దయా పాత్రలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి పవిత్రనాథ్ మరణించారు.
ఇలా ఈయన చనిపోయారనే విషయాన్ని మొగలిరేకులు సీరియల్ లో ఇంద్ర పాత్రలో నటించిన ఇంద్ర నీల్ ( Indra Neel ) భార్య మేఘన( Meghana ) సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ విషయం వైరల్ గా మారింది.ఈ సీరియల్ లో ఇంద్ర నీల్ కి తమ్ముడి పాత్రలో పవిత్రనాథ్ నటించారు.ఈ క్రమంలోనే మేఘన ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.
పవి.ఈ భాదని మేము వర్ణించలేకపోతున్నాం.నీవు మా లైఫ్ లో చాలా ముఖ్యమైనవాడివి.నీకు చివరగా గుడ్ బై కూడా చెప్పలేని పరిస్థితి.ఈ వార్త అబద్దం అయితే బావుండు అనిపిస్తుంది.నిన్ను చాలా మిస్ అవుతున్నాం.
నీ ఆత్మకి శాంతి చేకూరాలని ఈమె పోస్ట్ చేశారు.
ఇక ఏ కారణం వల్ల ఈయన చనిపోయారు అనే విషయాన్ని తెలియజేయలేదు కానీ ఈయన భార్య శశిరేఖ( Shasirekha ) గత కొద్ది రోజుల క్రితం ఈయన పట్ల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.ఈయన ప్రతి రోజు తాగి వచ్చి తనని బాగా టార్చర్ పెడతారని తన ముందే మరొక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నారని తనకు అమ్మాయిల పిచ్చి ఎక్కువగా ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇలా తన భార్య తన గురించి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అనంతరం తనకు అవకాశాలు రాలేదని తద్వారా తాగుడుకు బానిసయ్యారని తెలుస్తుంది.
మరి ఈయన మరణానికి గల కారణాలు ఏంటి అనే విషయాలు మాత్రం తెలియడం లేదు.