ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) కి కేంద్రంతో ప్రత్యేక్ష పొత్తు లేకపోయినప్పటికి పరోక్షంగా కేంద్రంతో సక్యంగానే మెలుగుతూ వచ్చారు.దాంతో వైసీపీ నేతలు కూడా కేంద్రంపై అరకొర విమర్శలు చేస్తున్నప్పటికి వాటి తీవ్రత ఏమంత ఎక్కువగా లేదనేది తెలిసిందే.
విశాఖ స్టీల్ ప్లాంట్ వివాదం, ప్రత్యేక హోదా, విశాఖా రైల్వే జోన్ వంటి సమస్యలపై కేంద్రం తీరును వైసీపీ సర్కార్ వ్యతిరేకిస్తున్నప్పటికి తీవ్రంగా ఖండించిన దాఖలాలు లేవు.ఇక ఏపీలోని పలు కార్యక్రమాలకు ప్రధాని మోడీని ఆహ్వానించి కేంద్రంతో ఉన్న ధోస్తిని బయట పెడుతూ వచ్చారు సిఎం జగన్మోహన్ రెడ్డి.

అటు మోడీ కూడా జగన్ పై కాస్త సానుకూలంగానే మెలుగుతూ వచ్చారు.అయితే కమలనాథులు ఎవరితో దోస్తీ చేసిన ఎవరితో విభేదించిన అది రాజకీయ వ్యూహంలో భాగమే అనే సంగతి బీజేపీ పార్టీ విధానాలను గమనించిన వారికి ఇట్టే అర్థమౌతుంది.వచ్చే ఎన్నికల్లో కూడా ఏపీలో వైసీపీ గెలిస్తే.కేంద్రంలోని బీజేపీకి వైసీపీ అవసరత ఉంటుంది.

ఈ కారణం చేతనే మోడీ( Narendra Modi ) కూడా జగన్ తో సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు.కానీ ఇప్పుడు ఏపీలో సిఎం జగన్ ను చుట్టుముట్టిన సమస్యలు అన్నీ ఇన్ని కావు.ఓవైపు బాబాయ్ వివేకా కేసు జగన్ మేడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది.మరోవైపు ప్రజావ్యతిరేకత పేళ్లుబొక్కుతోంది.దానికి ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికలే( MLC election ) నిదర్శనం.

దాంతో ఇంకా జగన్ తో సన్నిహితంగా మెలిగితే మొదటికి మోసం అవకాశం ఉందని భావించిన కేంద్రం.జగన్ తో విబేదానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.త్వరలోనే రాష్ట్రంలోని వివిధ శాఖలకు సంబంధించి అవినీతి చార్జ్ షీట్ లను కేంద్రం సిద్దం చేస్తున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మద్యం, ఇసుక, పోలవరం( Polavaram ), విద్యుత్ ప్రాజెక్టులు, భూ ఆక్రమణలు.ఇలా చాలా వాటిపై జగన్ సర్కార్ పై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్న సందర్భంలో వీటన్నిటిని నిగ్గు తెల్చేందుకు కేంద్రం ఓ కమిటీ వేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
ఇదే గనుక నిజం అయితే సిఎం జగన్ కు గట్టి షాక్ తగలడం ఖాయం.ఇప్పటికే వివేకా హత్య కేసు( YS Viveka Case ), కోడి కత్తి వ్యవహారం, ఎమ్మెల్యేల తిరుగుబాటు.
ఇలా ఎన్నో సమస్యలు వెంటాడుతుండగా కొత్తగా కేంద్రం కూడా అవినీతి బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే.జగన్ పనైపోవడం ఖాయమనే వాదన వినిపిస్తోంది.మరి ఏం జరుగుతుందో చూడాలి.







