ప్రస్తుత రోజుల్లో ప్రేమించుకోవడం అనేది సర్వసాధారణం.ఎందుకంటే పెద్దలు కుదిరించిన వివాహాల కంటే ప్రేమించి పెళ్లి( Love Marriage ) చేసుకున్న వివాహల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి.
అయితే కొన్ని ప్రేమలు పెళ్లి వరకు వెళ్తే.కొన్ని ప్రేమలు కుటుంబ సభ్యులు నిరాకరించడంతో వేరే వ్యక్తితో వివాహం చేసుకోవలసి వస్తుంది.
ఇలాంటి కోవకు చెందిన ఓ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని( Uttar Pradesh ) బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది.దానికి సంబంధించిన వివరాలు చూద్దాం.
ఓ 25 ఏళ్ల యువతి పక్కింటి అబ్బాయిని ప్రేమించి, తన ప్రేమ విషయం తల్లిదండ్రులకు చెప్పేసింది.అయితే కుటుంబ సభ్యులు యువతి ప్రేమను నిరాకరించి, వేరే అబ్బాయితో వివాహం చేశారు.
ఆ యువతి ప్రేమించిన యువకుడుని మర్చిపోలేక తనే కావాలని తల్లిదండ్రులకు తేల్చి చెప్పేసింది.దీంతో కూతురు వల్ల తమ పరువు పోతుందని భయపడిన ఆ తండ్రి కూతురిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
ఈ విషయంలో ఆమె సోదరుడు, బావ కూడా తండ్రి తోతరామ్ కు అండగా నిలిచారు.అర్ధరాత్రి యువతిని తీసుకొని ఆ తండ్రి బైక్ పై ఢిల్లీ నుండి లక్నోకి వెళ్లే హైవే పైకి తీసుకెళ్లి.
కుమార్తె గొంతు నుమిళితే స్పృహ తప్పి పడిపోయింది.

తర్వాత తన కుమారుడికి ఫోన్ చేసి టాయిలెట్ క్లీన్ చేసే యాసిడ్ ( Acid ) కొనుక్కొని రమ్మని ఫోన్ చేశాడు.కుమారుడు తీసుకొచ్చిన యాసిడ్ ను కుమార్తె గొంతులో, శరీరంపై వేయడంతో ఉళుకుపలుకు లేకుండా పడిపోయింది.కుమార్తె చనిపోయిందని భావించిన ఆ తండ్రి పక్కనే ఉన్న చెట్ల పొదల్లో పడేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు.
మరుసటి రోజు ఉదయం అటువైపుగా వెళ్తున్న వ్యక్తులు నగ్నంగా ఉండి దాదాపు 50 శాతం కాలిన గాయాలతో ఉండే యువతిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వెంటనే ఆసుపత్రికి తరలించారు.తర్వాత పోలీసులు తండ్రి తోతరామ్ ఫోన్ చేసి కుమార్తె పరిస్థితి గురించి చెప్పారు.తనకేం తెలియనట్టుగా ఆ తండ్రి ఈమధ్య కూతురికి వివాహమైందని, అల్లుడి వద్ద ఉందని తెలిపాడు.
పోలీసులు ఆ యువతి ఫోటోలను చూపించగా ఆమె తమ కూతురే కాదన్నాడు.కానీ ఓ రెస్టారెంట్లో అందరూ కలిసి భోజనం చేస్తున్న సీసీ ఫుటేజ్ ఉందని తెలపడంతో ఆ తండ్రి షాక్ అయ్యాడు.
ఆ యువతి తండ్రితో పాటు బావ దినేష్ కుమార్లను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.







