2024 ఎన్నికలే టార్గెట్ గా మోడీ రాజకీయ వ్యూహాలు.. బ్రహ్మస్త్రాన్ని బయటకు తీయనున్నాడా...?

భారత ప్రధాని నరేంద్ర మోడీ చరిస్మా భారతీయులకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అందరికి తెలుసు.కేవలం తన మాటల ద్వారా, హావ బావలతో ఒంటిచేత్తో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ధీరుడు అతను.

 Modi's Political Strategies For 2024 Elections, 2024 Elections, Narendra Modi,-TeluguStop.com

రాజకీయ ప్రత్యర్థులను తనకు తెలిసిన విద్య అయిన వాక్ చాతుర్యంతో తికమక పెట్టే నేర్పరి ఆయన.మునిగిపోయిన నావ లాంటి బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి కొత్త చట్టాలతో ప్రజలకు దగ్గరయ్యాడు ఆయన.2019కు ముందు కాంగ్రెస్ పార్టీకి వున్న ఆధారణ ను ప్రజలకు దూరం చేసి వారి స్కీమ్, స్కాం లను బట్టబయలు చేసి ప్రజలను చైతన్య వంతులను చేశాడు మోడీ.

తాజాగా నరేంద్ర మోడీ 2024 ఎన్నికలకు సర్వం సిద్ధం అవుతున్నాడు.

తన దగ్గర వున్న అస్త్రశస్త్రాలను ఒడ్డి గెలవాలని చూస్తున్నాడు.ఇప్పటికే తన దగ్గర దాచిపెట్టిన బాణాన్ని సందించనున్నారు.

యూనిఫాం సివిల్ కోడ్( ఉమ్మడి పౌర స్మృతి) ని దేశంలో ఇంప్లుమెంట చేయడానికి సిద్ధం అవుతున్నట్టు చర్చ జరుగుతుంది.గతంలోనే దీనిపై చర్చ జరిగినా ఇప్పుడు మాత్రం కచ్చితంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.

Telugu Community, Owaisi, Unim Civil-Political

దేశంలో ఒకే సివిల్ కోడ్ ఉండాలన్న వాదనలో నిజం వున్నా.లౌకిక దేశంలో మాతాలకు అనుగుణంగా చట్టాలు చేయడం ఏంటి.? చట్టం ముందు కుల,మత, ప్రాంత తేడాలు ఉండకూడదు కదా అన్న వాదన తెరమీదికి వస్తుంది.ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమీత్ షా ఉమ్మడి పౌరసత్వం గురించి మాట్లాడడం చర్చ అయింది.

ఇటీవలే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాల ముఖ్య మంత్రులు కూడా ఉమ్మడి పౌరసత్వం గురించి కీలక వాఖ్యలు చేయడం గమనార్హం.ఉత్తరాఖండ్ లో పైలెట్ ప్రాజెక్టు గా ఉమ్మడి పౌరసత్వాన్ని టేకాఫ్ చేయనున్నారు.

అక్కడ ఎదురయ్యే సమస్యల అనుభవాల ఆధారంగా దేశ వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే ఈ ఉమ్మడి పౌరసత్వం గురించి ముస్లీం కమ్యూనిటీ నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.

నిజానికి 2024 లో ఇదే బీజేపీ ఎన్నికల ప్రచార ఆయుధంగా వాడుకొనున్నారు దీంతో హిందూ అనుకూల ఓటు ను రాబట్టాలని మోడీ ఆలోచనగా కనిపిస్తుంది.ఇప్పటికే గోవాలో ఉమ్మడి ఉమ్మడి పౌరసత్వం అమలౌతుంది.

దీన్ని చట్టం చేసి వచ్చే ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా బీజేపీని బలపర్చే యోచనలో మోడీ కనబడుతున్నట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇదిలా ఉంటే మజ్లీస్ అధినేత ఓవైసీ దీన్ని ఖండించాడు.

రాజ్యాంగంలో చెప్పిన పౌరస్మృతి గురించి మాట్లాడే బీజేపీ అదే రాజ్యాంగంలో పొందుపర్చిన ఆదేశిక సూత్రాలను, అందులో మధ్య నిషేదం గురించి ఎందుకు మాట్లాడడని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube