రాజకీయాల్లో( politics ) శాశ్వత శత్రువులు.శాశ్వత మిత్రులు ఎవరు ఉండరని చెబుతుంటారు.
తాజాగా తెలంగాణలో జరుగుతున్నా పరిణామాలు చూస్తుంటే ఇది అక్షర సత్యం అని చెప్పక తప్పదు.మొన్నటి వరకు అధికార బిఆర్‌ఎస్ మరియు బీజేపీ మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనెంతలా రాజకీయ వేడి కొనసాగింది.
కేసిఆర్( KCR ) పై బీజేపీ నేతలు విమర్శలు చేయడం.అటు బీజేపీ పై మరియు మోడీ పాలన పై కేసిఆర్ అండ్ కో దుమ్మెత్తిపోయడం జరుగుతూ వచ్చాయి.
అయితే ఎవరు ఊహించని విధంగా ఈ మద్య బీజేపీని కాకుండా కన్త్రెస్ ను టార్గెట్ చేస్తోంది బిఆర్‌ఎస్ పార్టీ.
బిఆర్‌ఎస్( Brs ) బహిరంగ సభలలోనూ, ప్రసంగాలలోనూ ఎక్కడ బీజేపీ( BJP ) ప్రస్తావన గాని మోడీ పై విమర్శలు గాని చేయడం లేదు కేసిఆర్.ఈ మార్పు వెనక కారణం రెండు పార్టీల మద్య లోపాయికారి ఒప్పందం కుదిరిందనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట.తాజాగా మోడీ సర్కార్( Modi government ) వ్యవహరిస్తున్న తీరు చూస్తే నిజమేనేమో అనే డౌట్ రాక మానదు.గతంలో తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలకు సిఎం కేసిఆర్ దూరంగా ఉంటూ వచ్చారు.దానికి కారణం ఏంటని అడిగితే.కేంద్రం తమకు ఆహ్వానం పంపడం లేదనే సమాధానం వినిపించేవారు.
అటు కేంద్ర సర్కార్ కూడా సిఎం కేసిఆర్ ప్రోటోకాల్ పాటించడం లేదని ప్రధాని వస్తే కనీసం ఆహ్వానించేందుకు కూడా రావడం లేదనే విమర్శలు గుప్పించేది.కానీ తాజాగా ఈ నెల 8 న ప్రధాని తెలంగాణకు( Telangana ) వస్తున్న నేపథ్యంలో సిఎం కేసిఆర్ కు కేంద్రం అధికారికంగా ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది.దీంతో ఎడమొఖం పెదమొఖం గా ఉంటూ వచ్చిన కేసిఆర్ మరియు ప్రధాని మోడీ ఇప్పుడు ఇద్దరు కలిసి సెకండ్ ఇచ్చుకునే అవకాశం ఉందా ? అనే ప్రశ్నలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.ఇదే గనుక నిజం అయితే ఇరు పార్టీల మద్య దోస్తీ కుదిరిందనే వార్తలు మరింత బలపడే అవకాశం ఉంది.మరి కేంద్రం ఆహ్వానం మేరకు సిఎం కేసిఆర్.
మోడీ సభకు హాజరవుతారో లేదో చూడాలి.