ఇటీవల కాలంలో తాము ఉన్నామంటూ సహాయం చేసే వారి కంటే, మంచివాళ్లుగా నటించి అవసరం తీరాక దారుణంగా హత్యలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది.ప్రేమించిన యువతిని గర్భవతి చేసి, పెళ్లి చేసుకో అని కాస్త ఒత్తిడి చేయడంతో ఆ ప్రేమికుడు అత్యంత దారుణంగా హత్య చేశాడు.
ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ జిల్లాలో చోటు చేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో పూర్తిగా చూద్దాం.
వివరాల్లోకెళితే.మీరట్ జిల్లా( Meerut )లో వినోద్, రాంబిరి లకు 2015 లో వివాహం జరిగింది.ఒక సంవత్సరం తరువాత 2016లో ఈ దంపతులు విడిపోయారు.అప్పటినుంచి రాంబిరి తన పుట్టింట్లో తల్లిదండ్రులతో పాటు కలిసి నివసిస్తోంది.అయితే రాంబిరికు అదే ప్రాంతంలో ఉండే ఆదేశ్ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి శారీరక సంబంధానికి దారితీసింది.
వీరి బంధానికి గుర్తుగా రాంబిరి గర్భవతి అయ్యింది.ఈ విషయం తెలిసిన తరువాత పెళ్లి చేసుకోవాలని ఆదేశ్ ను ఒత్తిడికి గురిచేసింది.ప్రియురాలు ఒత్తిడిని భరించలేకపోయినా ఆదేశ్( Adesh ) తన స్నేహితులతో కలిసి ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు.
జులై 2న తన ఇంటికి రావాలని రాంబిరిని, అదేశ్ కోరాడు.ఆమె ఆదేశ్ ఇంటి వద్దకు రాగానే, అదేశ్ స్నేహితులు గర్భవతి అయిన రాంబిరి ను ఇటుకలతో కొట్టి హత్య చేశారు.
అనంతరం మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ పడేసి పరారయ్యారు.కూతురు రాంబిరి ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.పోలీసులు రాంబిరి మృత దేహాన్ని గుర్తించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.రాంబిరి ప్రియుడు ఆదేశ్ తో పాటు ఇతని స్నేహితులైన దీపక్, ఆర్యన్, సందీప్, రోహిత్ లను విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.