తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కర్ణాటకలో పర్యటిస్తున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా గుర్మిట్కల్ లో కాంగ్రెస్( Congress ) నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.
గుర్మిట్కల్ నుంచి మల్లికార్జున ఖర్గే తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీ కొనసాగారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.ఏఐసీసీ అధ్యక్షుడిగా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు.
గుర్మిట్కల్ ప్రజల ఆశీర్వాదం వలనే ఖర్గే ఈ స్థాయికి చేరుకున్నారని చెప్పారు.ఐదు గ్యారెంటీలను అమలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని తెలిపారు.
ఇక తెలంగాణలోనూ ఆరు గ్యారెంటీల్లో ఐదింటినీ అమలు చేశామని పేర్కొన్నారు.పదేళ్లలో మోదీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఆరోపించారు.
కర్ణాటకకు మోదీ ఇచ్చిందేమీ లేదన్న సీఎం రేవంత్ రెడ్డి ఖాళీ చెంబు తప్ప అంటూ ఎద్దేవా చేశారు.కరవు వస్తే కనీసం బెంగళూరుకు నీళ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
రిజర్వేషన్లను రద్దు చేసేందుకే మోదీ 400 సీట్లు కావాలని అడుగుతున్నారని మండిపడ్డారు.ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు కావాలనుకుంటే కాంగ్రెస్ కు ఓటు వేయండని కోరారు.