మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కమిటీ అత్యవసర సమావేశం..!!

భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య మరికొంత మంది సైనికులు హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించడం తెలిసిందే.

అయితే ఈ ఘటనకు సంబంధించి ఉగ్రవాద కోణం ఏమైనా ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇటువంటి తరుణంలో ప్రధాని మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం అయింది.ప్రధాని మోడీ నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో ప్రధానంగా హెలికాప్టర్ ప్రమాదంపై చర్చలు జరుపుతున్నారు.

ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా రక్షణశాఖ హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి నివేదిక భద్రతా వ్యవహారాల కమిటీకి ఇవ్వడం జరిగింది.13 మంది మరణించిన ఈ దుర్ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా మాత్రమే కాక అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది.ఉగ్రవాద కుట్రకోణం ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదే హెలికాప్టర్ అంతకుముందు ప్రమాదానికి గురైనట్లు.కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Advertisement

ఇదిలా ఉంటే సంఘటన జరిగిన తర్వాత బిపిన్ రావత్ ఇంటికి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు పలువురు ఆర్మీ ఉన్నత అధికారులు వెళ్లడం జరిగింది.

ఓరి దేవుడా . . వీరికి ఇదేం పోయేకాలం.. నడిరోడ్డుపై అలా..
Advertisement

తాజా వార్తలు