బయోపిక్ లపై గొడవలు అవడం ఇది కొత్తెమి కాదు.గతంలో చాలా సినిమాలకు ఇలా జరిగింది.
మోడీ బయోపిక్ సహ నిర్మాత అమిత్ బీ వాద్వానీ సోమవారం నాడు పోలీసులను ఆశ్రయించారు.నిన్ను చంపుతామంటూ కొందరు సోషల్ మీడియాలో బెదిరిస్తూ పోస్టులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.
ఈ మేరకు సైబర్ సెల్ లో ఫిర్యాదు చేశారు.ఆప్టిమిస్టిక్స్ అనే అకౌంట్ నుంచి ఈ పోస్టులు పెడుతున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన ఫోటోతో పాటూ కుమారుడి ఫోటోను కూడా సదరు యూజర్ పోస్ట్ చేశారని తెలిపారు.తాను మోదీ సినిమాను నిర్మించడం పట్ల ఆ వ్యక్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడని, తన కుటుంబాన్ని కూడా దుర్భాషలాడాడని ఆరోపించారు.
సోషల్ మీడియాలో ట్రోలింగ్ సాధారణమే అయినప్పటికీ తన కుటుంబం ప్రస్తావన కూడా రావడంతో పోలీసులను ఆశ్రయించకతప్పలేదని ఆయన తెలిపారు.కాగా.లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత రిలీజ్ కాబోతున్న తొలి సినిమాగా మోడీ బయోపిక్ ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.ఈ చిత్రంలో వివేక్ ఒబేరాయ్ ప్రధాన పాత్ర పోషించగా.
సందీప్ సింగ్ దర్శకత్వం వహించారు.