కేంద్ర క్యాబినెట్ విస్తరణ ? ఏపీ తెలంగాణకు ప్రాధాన్యం ?

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర అధికార పార్టీ బీజేపీ కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది.

ఒకవైపు కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం చుట్టుముట్టడంతో, ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

ఇదే సమయంలో ఎన్డీఏ లో ఉన్న మిత్రులు ఒక్కొక్కరుగా చేజారిపోతూ ఉండటం వంటి పరిణామాలు కేంద్రానికి కాస్త ఇబ్బందికరంగా మారాయి.అదీ కాకుండా ప్రస్తుతం కేంద్ర మంత్రుల్లో ఒకటి కంటే ఎక్కువ శాఖలు చూసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.

దీంతో వారిపై అదనపు భారం పెరగడంతో పాటు, పనులు వేగవంతంగా జరగడంలేదని, కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం సాధ్యం కావడంలేదనే అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో మోదీ కేంద్ర క్యాబినెట్ విస్తరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు కసరత్తు కూడా మొదలైందట.ఈ కేబినెట్ విస్తరణలో ఏపీ తెలంగాణకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది.తెలంగాణ పరిస్థితి మెరుగుపడింది అని, అధికార పార్టీ టిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి బీజేపీ ఎదిగింది అని, బీజేపీ ప్రభావం బాగానే కనిపిస్తోంది.

అయితే కొద్ది రోజులుగా ఏపీ అధికార పార్టీ వైసీపీ విషయంలో బీజేపీ కేంద్ర పెద్దలు సానుకూలంగా ఉన్నారు.

ఎన్డీఏలో ఒక్కో పార్టీ చేజారిపోతూ ఉండడంతో, జగన్ మద్దతు బీజేపీకి అనివార్యమైంది.ఈ పరిస్థితుల్లో వైసీపీకి కూడా కేంద్ర కేబినెట్లో సముచిత స్థానం ఇచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.అయితే ఎన్డీఏలో చేరే విషయంలో జగన్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోనప్పటికీ బీజేపీకి ఆయన మద్దతు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో వైసీపీకి కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది.వివిధ రాష్ట్రాల్లో జరగబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరీ కేబినెట్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
లడ్డూ వివాదం : ఆ ముగ్గురికి షర్మిల విజ్ఞప్తి 

దీనికి సంబంధించి మరో మూడు నాలుగు రోజుల్లో స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.ప్రస్తుతం పార్టీ కమిటీల్లో అవకాశం దగ్గర వారికి మోదీ జట్టులో అవకాశం దొరికే ఛాన్స్ కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు