కొంతమందికి ఫోటో షూట్స్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు.ఎప్పుడు చూడు ఫోటోలు దిగుతూ ఉంటారు.
ఇప్పుడు ప్రతి కార్యక్రమానికి ఫోటో షూట్స్ కామన్ అయి పోయాయి.ప్రెసెంట్ ఫోటో షూట్ ట్రెండ్ నడుస్తుంది.
ఇలా ఫోటోలు దిగుతూ ఆ ఫోటోల పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకుని ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మందే ఉన్నారు.ఎక్కువుగా యువత ఇలాంటి ప్రమాదాలకు గురి అవుతూ ఉన్నారు.
ఎన్ని సంఘటనలు జరుగుతున్న ప్రాణాలు ఫోటోలు తీసుకోవడం మాత్రం ఆపడం లేదు.ఫోటోలు బాగా రావాలని కోరుకుంటున్నారు కానీ వాటి వల్ల ఎంత ప్రమాదమో ముందు వెనుక చూడకుండా ప్రమాదాలను ఆహ్వానిస్తున్నారు.
తాజాగా ఒక మహిళ జంతువులు ఉన్న ప్రదేశంలో ఫోటో షూట్ కోసం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన జర్మనీ లో చోటు చేసుకుంది.
ఆ మహిళ ఫోటో షూట్ కోసం చిరుతల బోను దగ్గరకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుని ఇప్పుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.జన్మనీ సాక్సోని అన్హాల్ట్ రాష్ట్రంలో నెబ్రా అనే ప్రైవేట్ స్థలంలో ఒక వ్యక్తి జంతువుల రిటైర్మెంట్ హోమ్ ను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో జెస్సికా అనే మోడల్ చిరుతల బోను దగ్గరకు ఫోటో షూట్ కోసం వెళ్ళింది.

ఆమె ఫోటో షూట్ చేస్తున్న సమయంలో రెండు చిరుతలు ఒక్కసారిగా ఆమె మీద దాడి చేసాయి.ఈ దాడిలో ఆమెకు బాగా గాయాలయ్యాయి.నిర్వాహుకులు వెంటనే స్పందించి ఆమెను హెలికాఫ్టర్ సహాయంలో ఆస్పత్రికి తరలించారు.
ఆమె ప్రెసెంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.ఆమెకు తలకు తీవ్రంగా గాయాలవ్వడంతో సర్జరీ చేసినట్టు వైద్యులు తెలిపారు.
ఫోటో షూట్ లో పడి చురిత దగ్గరకు వస్తున్నా పట్టించుకోక పోవడంతో ఆమెపై చిరుతలు ఒక్కసారిగా దాడి చేసాయి.







