ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ అతివేగంగా ఎదుగుతున్నదని 2014 వరకు పరిపాలించిన ప్రభుత్వాలు భారతదేశాన్ని పదవ స్థానంలో నిలబెడితే తమ పరిపాలనలో ఉన్న గత తొమ్మిది సంవత్సరాలలో 5వ స్థానానికి తీసుకొచ్చామని తమకు మరొక అవకాశం వస్తే భారతను ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మూడవ స్థానంలో నిలబెడతామని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు .అభివృద్ది బాజాపా ముల సూత్రం అని దేశ అభివృద్ది కి బాజాపా కట్టుబడి ఉందని ఆయన చెప్పుకొచ్చారు .
భారత్( India ) ను శరవేగంగా అభివృద్ధి చేసే సత్తా భాజాపాకు మాత్రమే ఉందని సెలవిచ్చారు.

అయితే ప్రధానమంత్రి ( Narendra Modi)చెప్పిన లెక్కలపై మాత్రం ఆర్థిక నిపుణులు పెదవి విరుస్తున్నారు .భాజపా( BJP ) అదికారం లో కూర్చున్న ఈ తొమ్మిది సంవత్సరాలలో భారత జిడిపి కేవలం 93% మాత్రమే పెరిగినదని అదే యూపీఏ పరిపాలనైన 2004 నుంచి 2014 సంవత్సరాల మధ్య భారత జిడిపి రేటు 183 శాతం గా ఉందని, దీనిని బట్టి ఎవరిది ఆర్థికంగా అత్యద్భుతమైన పాలనో తెలుసుకోవాలంటూ విశ్లేషణలు వస్తున్నాయి.ఆర్థిక వ్యవస్థలలో పదవ స్థానంలో ఉన్న భారత ఐదవ స్థానానికి చేరడానికి ఎన్డీఏ పాలనా గొప్పతనం కన్నా కన్నా మిగిలిన ఐదు దేశాలు వెనకబడి పోవడం వల్ల మాత్రమే ఈ పరిస్థితి ఎదురైంది అని ఆయా దేశాలు ఎదుర్కొన్న ఫైనాన్షియల్ క్రైసిస్, రాజకీయ ఆర్థిక కారణాలతో ఆ దేశాలు వెనకబడ్డాయి అందువల్ల టెక్నికల్ గా భారత్ ముందుకు వచ్చినట్టుగా కనిపిస్తుంది తప్ప ఆర్థిక వ్యవస్థకుఊతమిచ్చే కీలక నిర్ణయాలు ఎన్డిఏ తీసుకోలేదు అన్నది ఆర్థికవేత్తల మాట.

పారిశ్రామికంగా కానీ తయారీ రంగంగా భారత్ ను అభివృద్ధి చేయడంలో కానీ మాటలు చెప్పినంత వేగంగా ఎన్డీఏ ప్రభుత్వం చేతల్లో చూపించలేదని కేవలం ప్రభుత్వ రంగ ఆస్తులు నమ్ముకోవడం వివిధ సంస్థలలో ప్రభుత్వం పెట్టిన పెట్టుబడులను ఉపసంహరించుకోవడం తప్ప ఈ పది సంవత్సరములో ఎన్డీఏ చేసిన ఏమి లేదని కేవలం ఇతర రాజకీయ అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కోసం మాత్రమే ఇలాంటి కాకి లెక్కలను చెబుతుందంటూ కాంగ్రెస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి .