కె.టి.కుంజుమన్ నిర్మిస్తోన్న‌ `జెంటిల్‌మేన్‌2` చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడిగా ఎం.ఎం.కీర‌వాణి

ప్ర‌ముఖ నిర్మాత కె.టి.

 Mm Keeravani As Music Director For Kt Kunjuman's Upcoming Film 'gentleman 2, Kt-TeluguStop.com

కుంజుమన్ నిర్మించిన జెంటిల్ మేన్‌, కాద‌లన్ (ప్రేమికుడు), కాద‌ల్ దేశం (ప్రేమదేశం) వంటి చిత్రాలు తమిళ, తెలుగు భాష‌ల‌లో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి.సినిమా ప‌బ్లిసిటీలో ప్రత్యేకమైన ప్రచార వ్యూహాలకు పేరుగాంచిన ప్రముఖ నిర్మాత కె.టి.కుంజుమన్జెంటిల్ మేన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ప‌తాకంపై తన సూపర్ హిట్ సినిమా జెంటిల్ మేన్‌ కు సీక్వెల్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.ఈ సినిమాకు సంబందించి ఇటీవ‌ల ట్విట్టర్ లో ఒక కాంటెస్ట్‌ను నిర్వ‌హించారు.#G2MusicDirector అనే హ్యాష్ ట్యాగ్ తో త‌న‌ జెంటిల్ మేన్ 2 చిత్రానికి సంగీతం చేయబోతున్న లెజెండరీ సంగీతకారుడిని ఊహిస్తే .అదృష్ట‌వంతులైన ముగ్గురు విజేతలకు ఒక్కొక్కరికి బంగారు నాణెం బహుమతిగా ఇవ్వబడుతుంది.అని తెలిపారు.

ఈ రోజు జెంటిల్‌మేన్‌ 2 సినిమాకు సంగీత ద‌ర్శ‌కుడిగా స్వ‌ర‌వాణి కీర‌వాణి ప‌నిచేస్తున్నార‌ని నిర్మాత కుంజుమ‌న్ ప్ర‌క‌టించారు.`భారతీయ సినిమా యొక్క ఐకానిక్ లెజెండ్, ఎం.ఎం.కీరవాణి గారు, నా జెంటిల్ మేన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పై నిర్మిస్తోన్న ‘జెంటిల్ మేన్ 2` చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్య‌వ‌హరిస్తున్నార‌ని నేను గర్వంగా ప్రకటిస్తున్నాను.

త్వ‌ర‌లోనే బంగారు నాణేల విజేతలను కూడా ప్రకటిస్తాను.అని ప్ర‌ముఖ నిర్మాత కే.టి కుంజుమ‌న్ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా , శంకర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ కేటి కుంజుమ‌న్ నిర్మించిన‌ ‘జెంటిల్‌మేన్’ సినిమా భారీ విజ‌యం సాధించింది.

అయితే శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణసింగ్ ప్రేమదాస హత్య ఆధారంగా సినిమా క్లైమాక్స్ ను తిరిగి రాయమని దర్శకుడు శంక‌ర్‌కు సూచించినందుకు గాను ప్రసిద్ధి చెందాడు .నిర్మాత కుంజుమ‌న్.అర్జున్ సర్జా, మధు ప్రధాన పాత్రల్లో నటించిన జెంటిల్ మేన్ చిత్రం అవినీతి రాజకీయ నాయకులు, భారతదేశంలోని విద్యా వ్యవస్థలోని లోపాల‌పై తెర‌కెక్కింది.  27 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు వేరే టీమ్‌తో సీక్వెల్ చేయనున్నారు నిర్మాత కుంజుమ‌న్‌.ఈ సినిమాకు సంబందించి ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేయ‌నున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube