తెలుగు దేశం పార్టీలో రోజు రోజుకు నేతల్లో పదవులపై ఆశ పెరిగిపోతుంది.దానికి ముఖ్య కారణం ఏ.
పీ లో శాసనమండలి స్థానాలను ఏభై నుంచి ఎభై ఎనిమిదికి పెంచే ప్రయత్నంలో ప్రభుత్వం ఆలోచన చేయడమే.అయితే ఏ.పీ శాసన సభలో 175సీట్లు ఉన్న నేపధ్యంలో అందులో మూడో వంతు వరకు శాసన మండలి సభ్యులు ఉండవచ్చు.ఇక ఈ లెక్కన తీసుకుంటే మరో 8సీట్లు ఏ.పీ కు వచ్చే అవకాశం ఉంది.అందులో అత్యధికంగా టీడీపీకి వచ్చే అవకాశం ఎక్కువ.
మరో పక్క ఆ పదవుల కోసం పార్టీలో ఎదురుచూస్తున్న ఆశావాహుల లెక్క సైతం ఎక్కువగానే కనిపిస్తుంది.
ముఖ్యంగా సీనియర్ నేతలు రాయల సీమ నేతలు గాలి ముద్దు కృష్ణమ నాయుడు, సోమిరెడ్డి చంధ్రమోహన్ రెడ్డి, పయ్యావుల ఎం.ఎల్.సీ రేస్ లో ముందు వరుసల ఉండగా, పార్టీ కోసం అహర్నిశలూ పనిచేసిన కొందరు సైతం ఈ పదవుల కోసం ఆశపడుతున్నారు.మరి ఏ నేతలు పదవి దక్కుతుందో, ఏ నేతకు బాబు మొండి చెయ్యి చూపిస్తారు తెలీదు కానీ, మొత్తానికైతే ఎమ్.ఎల్.సీ పదవుల విషయంలో మాత్రం గట్టి పోటీ నెలకొంది అని చెప్పవచ్చు.