కర్ణాటక రాష్ట్రంలో మే 10వ తారీకు అసెంబ్లీ ఎన్నికలు( Assembly elections ) జరగనున్న సంగతి తెలిసిందే.దీంతో నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది.
ఈ ఎన్నికలలో బీజేపీ నాయకులు భారీ ఎత్తున ప్రచారంలో కీలకంగా పాల్గొన్నారు.ప్రధాని మోడీ( Prime Minister Modi ) ఎన్నడూ లేని రీతిలో రోడ్డు షోలలో… బహిరంగ సభలలో పాల్గొనడం జరిగింది.
దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాటకలోనే బీజేపీ పార్టీకి పట్టు ఉంది.సో కచ్చితంగా ఈ ఎన్నికలలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ( BJP ) పెద్దలు తీవ్ర స్థాయిలో కృషి చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే దేశ ప్రధాని మోడీ పై కర్ణాటక ఎమ్మెల్సీ హెచ్ విశ్వనాధ్ సీరియస్ కామెంట్స్ చేశారు.ప్రధాని మోడీ రోడ్ షో.చివరికి ఫ్యాషన్ షోలా అయ్యిందని వ్యాఖ్యానించారు.

ఓ దేశ ప్రధాని అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఇన్ని రోజులు… కేటాయించడం తాను ఎప్పుడు చూడలేదని అన్నారు.ప్రజా సమస్యలు గాలికి వదిలేసారని మండిపడ్డారు.మంత్రి పదవి రాలేదని కోపంతో బీజేపీకి దూరమైన మైసూర్ కి చెందిన హెచ్ విశ్వనాథ్( H Vishwanath )… అప్పటి నుంచి బీజేపీ పై సమయం దొరికినప్పుడల్లా విమర్శలు చేస్తూ ఉన్నారు.
సోమవారం మైసూర్ లో మీడియా సమావేశం నిర్వహించి బీజేపీ నేతలపై మండిపడ్డారు.దేశ ప్రధాని కాబట్టి మోడీ అంటే గౌరవం అని.చెబుతూనే దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి అంటూ… వాటిపై కూడా దృష్టి పెట్టాలని ఎమ్మెల్సీ విశ్వనాథ్ పేర్కొన్నారు.వాటి గురించి పట్టించుకోకుండా దేశ ప్రధాని అయి ఉండే అసెంబ్లీ ఎన్నికల గురించి రోడ్ షో నిర్వహించటం బాధాకరమని.
బెంగళూరులో మోడీ రోడ్ షో అట్టర్ ఫ్లాప్ అయిందని ఆరోపించారు.







