ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కుటుంబ సభ్యులు వెళ్లనున్నారు.లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన కవితను కలిసేందుకు కుటుంబ సభ్యులకు, న్యాయవాదులకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అనుమతి ఉన్న నేపథ్యంలో కవిత భర్త అనిల్, కేటీఆర్, హరీశ్ రావు, శ్రీధర్, ప్రణీత్ మరియు పీఏ శరత్ చంద్ర ఆమెను కలవనున్నారు.అలాగే లాయర్లు మోహిత్, షఫీలకు కూడా కవితను కలవనున్నారని సమాచారం.







