బీఆర్ఎస్ ను చిక్కుల్లో పడేసిన కవిత ! విచారణకు రేవంత్ ఆదేశం 

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం  బీఆర్ఎస్ పార్టీని చిక్కుల్లో పడేశారు ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.కవిత మాటలను సీరియస్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి బీ ఆర్ ఎస్ ను ఇరుకున అదే విధంగా చేశారు.

 Mlc Kavitha Put Brs In Trouble! Revanth Orders The Investigation, Brs, Bjp, Tel-TeluguStop.com

శాసనమండలిలో కాలేశ్వరం ప్రాజెక్టు పై రేవంత్ రెడ్డి( Revanth Reddy ) మాట్లాడారు.ఈ ప్రాజెక్టులో భారీగా అవినీతి చోటుచేసుకుందని అనేక విమర్శలు చేశారు.

దీనిపై స్పందించిన కవిత అవసరమైతే ఈ ప్రాజెక్టుపై విచారణ చేయించుకోవాలంటూ మాట్లాడారు.దీనిని వ్యూహాత్మకంగా తీసుకుని తనకు అనుకూలంగా మార్చుకున్న రేవంత్ కాలేశ్వరం ప్రాజెక్టు లో చోటు చేసుకున్న అవినీతి పై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించారు .తనకు తానుగా ఈ ప్రాజెక్టుపై విచారణకు ఆదేశిస్తే రాజకీయంగా కక్ష తీర్చుకునేందుకు రేవంత్ ఈ విధంగా చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శలు చేసినందుకు అవకాశం ఏర్పడింది.

Telugu Medigadda, Mlc Kavitha, Telangana Cm, Telangana-Politics

కానీ అక్కడే రేవంత్ రాజకీయ తెలివితేటలను ప్రదర్శించారు .ఈ ప్రాజెక్టు పై కవిత నే విచారణ కు డిమాండ్ చేసే విధంగా రేవంత్ సందర్భం సృష్టించి,  కవిత మాటలను సీరియస్ గా తీసుకుని ఆమె కోరిక మేరకే ఈ ప్రాజెక్టుపై విచారణ చేస్తున్నామని ప్రకటించారు.శాసనమండలిలో ఈ ప్రాజెక్టు పై మాట్లాడిన రేవంత్ రెడ్డి అందరికీ మేడిగడ్డ చూపిస్తానని,  అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రత్యేక బస్సుల్లో అందరం వెళదామని అన్నారు.

  దీనిపై కవిత స్పందించి అదేమి టూరిస్ట్ స్పాట్ కాదు అని,  ఏవైనా లోపాలు ఉంటే విచారణ చేయించాలి కానీ , ప్రాజెక్టునే తప్పు పట్టడం సరికాదంటూ ఆమె వ్యాఖ్యానించారు.దీనిపై వెంటనే స్పందించిన రేవంత్ కవిత విజ్ఞప్తి మేరకు కాలేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామని ప్రకటించారు.

Telugu Medigadda, Mlc Kavitha, Telangana Cm, Telangana-Politics

 అయితే వాస్తవంగా కవిత కోరింది మేడిగడ్డ కొంగుబాటు( Medigadda )పై నిపుణులను తీసుకువెళ్లి ఎందుకు కుంగిందో విచారణ చేయించాలని మాత్రమే కోరారు.కానీ రేవంత్ రెడ్డి మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించి కవిత కోరిన విధంగానే ప్రాజెక్టుపై విచారణకు ఆదేశిస్తున్నట్లుగా ప్రకటించి …  బీఆర్ఎస్ దీనిపై ఎటువంటి విమర్శలు చేసేందుకు ఆస్కారం లేకుండా చేయగలిగారు.వాస్తవంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కాలేశ్వరం ప్రాజెక్టుపై అనేక విమర్శలు చేశారు .ఈ ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని , బీఆర్ఎస్ పెద్దలు భారీగా లబ్ధి పొందారని ,కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై విచారణ చేస్తామని అప్పట్లోనే రేవంత్ ప్రకటించారు .అనుకున్నట్లుగానే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇప్పుడు దీనిపై సింగిల్ జడ్జి తో విచారణ కు ఆదేశించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube