బీఆర్ఎస్ ను చిక్కుల్లో పడేసిన కవిత ! విచారణకు రేవంత్ ఆదేశం 

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం  బీఆర్ఎస్ పార్టీని చిక్కుల్లో పడేశారు ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

కవిత మాటలను సీరియస్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి బీ ఆర్ ఎస్ ను ఇరుకున అదే విధంగా చేశారు.

శాసనమండలిలో కాలేశ్వరం ప్రాజెక్టు పై రేవంత్ రెడ్డి( Revanth Reddy ) మాట్లాడారు.

ఈ ప్రాజెక్టులో భారీగా అవినీతి చోటుచేసుకుందని అనేక విమర్శలు చేశారు.దీనిపై స్పందించిన కవిత అవసరమైతే ఈ ప్రాజెక్టుపై విచారణ చేయించుకోవాలంటూ మాట్లాడారు.

దీనిని వ్యూహాత్మకంగా తీసుకుని తనకు అనుకూలంగా మార్చుకున్న రేవంత్ కాలేశ్వరం ప్రాజెక్టు లో చోటు చేసుకున్న అవినీతి పై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించారు .

తనకు తానుగా ఈ ప్రాజెక్టుపై విచారణకు ఆదేశిస్తే రాజకీయంగా కక్ష తీర్చుకునేందుకు రేవంత్ ఈ విధంగా చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శలు చేసినందుకు అవకాశం ఏర్పడింది.

"""/" / కానీ అక్కడే రేవంత్ రాజకీయ తెలివితేటలను ప్రదర్శించారు .ఈ ప్రాజెక్టు పై కవిత నే విచారణ కు డిమాండ్ చేసే విధంగా రేవంత్ సందర్భం సృష్టించి,  కవిత మాటలను సీరియస్ గా తీసుకుని ఆమె కోరిక మేరకే ఈ ప్రాజెక్టుపై విచారణ చేస్తున్నామని ప్రకటించారు.

శాసనమండలిలో ఈ ప్రాజెక్టు పై మాట్లాడిన రేవంత్ రెడ్డి అందరికీ మేడిగడ్డ చూపిస్తానని,  అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రత్యేక బస్సుల్లో అందరం వెళదామని అన్నారు.

  దీనిపై కవిత స్పందించి అదేమి టూరిస్ట్ స్పాట్ కాదు అని,  ఏవైనా లోపాలు ఉంటే విచారణ చేయించాలి కానీ , ప్రాజెక్టునే తప్పు పట్టడం సరికాదంటూ ఆమె వ్యాఖ్యానించారు.

దీనిపై వెంటనే స్పందించిన రేవంత్ కవిత విజ్ఞప్తి మేరకు కాలేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామని ప్రకటించారు.

"""/" /  అయితే వాస్తవంగా కవిత కోరింది మేడిగడ్డ కొంగుబాటు( Medigadda )పై నిపుణులను తీసుకువెళ్లి ఎందుకు కుంగిందో విచారణ చేయించాలని మాత్రమే కోరారు.

కానీ రేవంత్ రెడ్డి మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించి కవిత కోరిన విధంగానే ప్రాజెక్టుపై విచారణకు ఆదేశిస్తున్నట్లుగా ప్రకటించి .

  బీఆర్ఎస్ దీనిపై ఎటువంటి విమర్శలు చేసేందుకు ఆస్కారం లేకుండా చేయగలిగారు.వాస్తవంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కాలేశ్వరం ప్రాజెక్టుపై అనేక విమర్శలు చేశారు .

ఈ ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని , బీఆర్ఎస్ పెద్దలు భారీగా లబ్ధి పొందారని ,కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై విచారణ చేస్తామని అప్పట్లోనే రేవంత్ ప్రకటించారు .

అనుకున్నట్లుగానే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇప్పుడు దీనిపై సింగిల్ జడ్జి తో విచారణ కు ఆదేశించారు.